నిర్భయ దోషులకు ఆఖరి నిమిషంలో కూడా ఉరి శిక్ష ను వాయిదా వేయించాలని ప్రయత్నం చేసిన వారికి నిరాశే ఎదురైంది. నిర్భయ దోషులలో ఒకడైన అక్షయ్ కుమార్ సింగ్ పై అతడి భార్య విడాకుల పిటీషన్ దాఖలు చేసింది. భార్య విడాకుల పిటిషన్ పెండింగులో ఉన్నందున అతడికి ఉరి అమలు చేయడం సరి కాదని వాదిస్తూ ఢిల్లీ హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ ను ఢిల్లీ హైకోర్టు కొట్టేసింది.
విడాకుల కేసు ఉరి శిక్ష అమలు చేయడానికి అడ్డంకి కాదని, దానికి దీనికి సంబంధం లేదని జస్టిస్ మన్మోహన్ నేతృత్వంలోని ధర్మాసనం తేల్చి చెప్పింది. తర్వాత వారి పిటిషన్ ను డిస్మిస్ చేశారు. గురువారం సాయంత్రం ఢిల్లీ హైకోర్టులో ఈ పిటిషన్ దాఖలు కావడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొన్నది. పిటిషన్ పై అత్యవసరంగా విచారణ జరిపారు. చివరకు కేసు కొట్టేయండంతో శుక్రవారం ఉదయం 5.30 గంటలకు ఉరి ఖరారు అయింది.