26.7 C
Hyderabad
May 3, 2024 08: 14 AM
Slider నల్గొండ

కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను పర్మినెంట్ చేయాలి

#CITUNalgonda

ముఖ్యమంత్రి కెసిఆర్  హైకోర్టు తీర్పు ఇవ్వగానే సచివాలయం కూల్చి కొత్త సచివాలయం ఎంత వేగంగా అమలు చేస్తున్నారో అలాగే జిహెచ్ఎంసి, మున్సిపాలిటీలలో పనిచేస్తున్న కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులందరనీ అంతే వేగంగా పర్మినెంట్ చేసి హైకోర్టు తీర్పును అమలు చేయాలని జిల్లా CITU ఉపాధ్యక్షులు శీతల రోషపతి డిమాండ్ చేశారు.

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని మున్సిపల్ కార్మికుల జనరల్ బాడీ సమావేశంలో రోషపతి పాల్గొని మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం వస్తే ఈ రాష్ట్రంలో కాంట్రాక్ట్ కార్మికుల అనే మాటే వినపడదని, కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ ఉద్యోగ కార్మికులందరనీ పర్మినెంట్ చేస్తానని కేసీఆర్ ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని అన్నారు.

కరోనా కాలంలో  కష్టపడుతున్న వారిని పర్మినెంట్ చేసి న్యాయం చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో  మున్సిపల్ వర్కర్స్ & ఎంప్లాయ్ యూనియన్ అధ్యక్ష ,కార్యదర్శులు కె ముత్తమ్మ,  మెరిగ దుర్గారావు ,కుమారి ,రవి, సైదులు ,వెంకన్న, గురవమ్మ, రాములమ్మ, రాంబాయి, శ్రీను, రాములు, తదితరులు పాల్గొన్నారు.

Related posts

ఆఫ్ఘనిస్థాన్ లో మైనారిటీల హక్కులను పరిరక్షించాలి

Satyam NEWS

వాక్సినేషన్ వేసుకున్నా..మాస్క్ తప్పనిసరి…!

Satyam NEWS

కోనసీమ లో విధ్వంస ఘటనల వెనుక అరాచక  శక్తులు

Satyam NEWS

Leave a Comment