38.2 C
Hyderabad
April 29, 2024 20: 17 PM
Slider ప్రత్యేకం

న్యూ కాంట్రవర్సీ: షిర్డీ సాయి బాబాపై కొత్త వివాదం

shirdi_sai_baba-shamadhi-1

ఉన్న వివాదాలు చాలవన్నట్లు ఇప్పుడు మహారాష్ట్రంలో కొలువై ఉన్న శివసేన కొత్త వివాదాన్ని రేకెత్తించింది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి, శివసేన అధిపతి ఉద్ధావ్ థాక్రే ఇటీవల ఒక సందర్భంలో మాట్లాడుతూ షిర్డీ సాయిబాబా షిర్డీలో పుట్టలేదని వ్యాఖ్యానించారట. మహారాష్ట్ర లోని పర్బనీ జిల్లా పాథ్రీ సాయి జన్మస్థానమని కూడా ఆయన చెప్పారట. దాంతో వివాదం అంటుకున్నది.

అంతే కాకుండా పాథ్రీ అభివృద్ధి కోసం ఆయన రూ. 100 కోట్లు విడుదల చేశారు. ఈ నేపథ్యంలో సాయి కర్మభూమిగా భావించే శిరిడీలో ఆందోళనలు మొదలయ్యాయి. పాథ్రీ అభివృద్ధిని తాము వ్యతిరేకించట్లేదని తమ బాధ అంతా సాయి జన్మభూమిగా ప్రచారం చేయటమేనని శిరిడీ వాసులు చెబుతున్నారు. ఈ ప్రచారాన్ని నిరసిస్తూ శిరిడీలో ఆదివారం నుంచి సమ్మె చేపట్టాలని స్థానికులు నిర్ణయించారు.

ఈ కారణంగా చరిత్రలో మొదటిసారి శిరిడీ మూతపడనుంది. అయితే ఆలయాన్ని మాత్రం మూసివేయమని ఆందోళనకారులు తెలిపారు. శిరిడీకి నిత్యం వేలాది మంది సందర్శకులు వస్తుంటారు. ఈ నిర్ణయంతో భక్తులు, పర్యటకులపై భారీ ప్రభావం పడనుంది. ఈ నేపథ్యంలోనే భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకూడదని రెండు రోజుల ముందుగా ప్రకటన చేసినట్లు ఆందోళనకారులు తెలిపారు.

Related posts

ఎస్సి ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు దారిమళ్లిస్తున్న జగన్ సర్కార్

Satyam NEWS

చైనాలో ప్రమాదకరంగా పెరుగుతున్న కరోనా కేసులు

Satyam NEWS

ఘనంగా డా.శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ 121వ జయంతోత్సవం

Satyam NEWS

Leave a Comment