32.2 C
Hyderabad
May 8, 2024 11: 56 AM
Slider చిత్తూరు

చిత్తూరు ఎస్‌పీ రిషాంత్‌ రెడ్డి చుట్టూ ముసురుకున్న వివాదం

#SP Rishant Reddy

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై రాళ్ల దాడి జరిగిన సంఘటనలో చిత్తూరు జిల్లా ఎస్పీ రిషాంత్ రెడ్డి వ్యవహారం వివాదాస్పదమవుతోంది. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని రావణాసురుడుగా చంద్రబాబు అభివర్ణించడం వల్లే వైసీపీ నేతలు నిరసన తెలిపారని ఎస్పీ చెబుతున్నారు. నీటిపారుదల ప్రాజెక్టులపై జగన్ ప్రభుత్వం కొనసాగిస్తున్న విధ్వంసంపై యుద్ధభేరి పర్యటనలో భాగంగా చంద్రబాబునాయుడు పర్యటిస్తున్నారు. అందులో భాగంగా అంగళ్లు నుంచి పుంగనూరు బయల్దేరిన చంద్రబాబును అడ్డుకునేందుకు వైసీపీ శ్రేణులు విశ్వప్రయత్నం చేశాయి.

దీంతో టీడీపీ, వైసీపీ శ్రేణులు మధ్య ఘర్షణ జరిగింది. పరస్పరం రాళ్లు రువ్వుకున్నారు. వాహనాలను ధ్వంసం చేసుకున్నారు. అడ్డుకోబోయిన పోలీసులపై కూడా రాళ్లు రువ్వారు. పోలీసు వాహనాన్ని కూడా ధ్వంసం చేశారు. దీంతో ఆగ్రహించిన పోలీసులు లాఠీచార్జ్ చేశారు. పరిస్థితిని అదుపు చేసేందుకు భాష్పవాయువు ప్రయోగించారు. గాల్లోకి కాల్పులు జరిపారు. ఈ మొత్తం వ్యవహారంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో గాయపడ్డారు.

పోలీసులకు మాత్రమే గాయాలు తగిలినట్లు ఎస్ పి చెబుతున్నారు. పోలీసులపై దాడి చేసిన వారిని ఇంటరాగేట్ చేస్తామని ఆయన బహిరంగంగా చెబుతున్నారు. మరి తీవ్ర గాయాలతో రక్తం ఓడుతున్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై దాడి చేసిన వారి సంగతి ఏమిటని జిల్లా ప్రజలు ప్రశ్నిస్తున్నారు. వాస్తవానికి తంబళ్లపల్లె నియోజకవర్గంలో అంగళ్లు అనే గ్రామం వద్ద టీడీపీ నేతలపై ఎన్ని సార్లు దాడులు జరిగాయో లెక్కే లేదు. అలాంటి సున్నితమైన చోట.. రాడ్లు, రాళ్లు, కర్రలతో వందల మంది వైసీపీ కార్యకర్తలు చంద్రబాబు వచ్చే ముందు గుమికూడారు.

చంద్రబాబు పర్యటనలో వైసీపీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో గుమికూడితే పోలీసులు వారిని నివారించవద్దా అని చిత్తూరు జిల్లా వాసులు ప్రశ్నిస్తున్నారు. అంగళ్లులో చంద్రబాబుపై రాళ్లదాడిని అది వైసీపీ కార్యకర్తల నిరసన అంటూ ఎస్పీ చెప్పడంపై విమర్శలు వస్తున్నాయి. అంగళ్లులో చంద్రబాబు ప్రసంగిస్తున్నప్పుడు రాళ్ల దాడి జరిగింది. పోలీసులు సహకరించకపోతే రాళ్లు వేసేంత దగ్గరగా వైసీపీ కార్యకర్తలు రాలేరు. ఈ ఘటనపై చంద్రబాబు మండిపడ్డారు.

పోలీసుల చేతకానితనంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక లాభం లేదని చంద్రబాబు రాళ్లు వేస్తున్న వైసీపీ కార్యకర్తల్ని తరమాలని పిలుపునిచ్చారు. చంద్రబాబు పిలుపుతో టీడీపీ కార్యకర్తలు వెంటపడటంతో వైసీపీ కార్యకర్తలు పరారయ్యారు. వారికి రక్షణగా ఉన్న పోలీసులు కూడా పారిపోవాల్సి వచ్చింది. అక్కడ డీఎస్పీ వ్యవహారశైలిపై చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నేతలు రెచ్చగొట్టాలని, దాడులు చేయాలనుకున్న చోటే ఉద్రిక్తంగా మారుతోంది.

పుంగనూరులో పోలీసులు ఈ కుట్రలో భాగం అయ్యారనే విమర్శలు వినిపిస్తున్నాయి. అంగళ్లు నుంచి చంద్రబాబు పుంగనూరులోకి రాకుండా లారీలు, బస్సులు, వజ్ర వాహనాన్ని అడ్డం పెట్టారు. దీంతో టీడీపీ కార్యకర్తలు ఆగ్రహం తెచ్చుకున్నారు. ఇదే విషాయన్ని రిషాంత్ రెడ్డి చెబుతున్నారు. అక్కడ అడ్డం పెడితే ఘర్షణలు సృష్టించవచ్చని ముందుగానే గుర్తించి.. పోలీసులు రబ్బర్ బుల్లెట్లు, వజ్ర వాహనంతో వచ్చారు.

టీడీపీ కార్యకర్తల్ని రెచ్చగొట్టారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాజకీయ నాయకులకు కొమ్ము కాయడం కోసం ఎస్పీ రిషాంత్ రెడ్డి పోలీసుల్ని బలి చేస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. దీనితో రిషాంత్ రెడ్డి వ్యవహారం హాట్ టాపిక్ అయింది.

Related posts

కెసిఆర్ రాజకీయ చరిత్రలో అతిపెద్ద మోసం ఇది

Satyam NEWS

నీట్‌, జేఈఈ సాధనకు ‘కోటా’ స్టడీ మెటీరియల్‌ సిద్ధం

Satyam NEWS

నేరాల నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలి

Satyam NEWS

Leave a Comment