27.7 C
Hyderabad
April 26, 2024 06: 47 AM
Slider విజయనగరం

టెంపుల్స్ లో సీసీ కెమేరాలు ఏర్పాటు చేయించండంటూ ఆదేశం

#VijayanagaramSP

ఏపీలో వ‌రుస‌గా దేవాలయాల‌లో ఉన్న విగ్ర‌హాల‌పై జ‌రుగుతున్న విధ్వంసంపై రాష్ట్ర డీజీపీ సీరియస్ గానే వ్య‌వ‌హ‌రిస్తున్నారు. మీడియాలలో వ‌స్తున్న త‌ప్పుడు క‌థ‌నాలపై ప్ర‌త్యేకించి అదీ పండుగ సంద‌ర్బంగా ప్రెస్ కాన్ఫ‌రెన్స్ పెట్టి మ‌రీ..పోలీస్ శాఖ తీసుకుంటున్న చ‌ర్య‌ల గురించి తెలియ‌చేసారు.

మ‌రీ ముఖ్యంగా రామ‌తీర్దం నీలాచలం కొండ‌పై జ‌రిగిన రాములోరి విగ్ర‌హ ధ్వంసం కేసును కూడా ప్రస్తావిస్తూ….పోలీస్ శాఖ చాలా సీరియస్ గానే తీసుకుంద‌ని చెప్పారు కూడ‌. దాన్ని దృష్టిలో పెట్టుకునే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని దేవాల‌యాల‌లో ఆ గ్రామంలో ఉన్న యువ‌తచే గ్రామ ర‌క్ష‌క ద‌ళాన్ని కూడా ఏర్పాటు చేయించింది..పోలీస్ శాఖ‌.

ఈ నేప‌ధ్యంలో రామ‌తీర్ధం నీలాచ‌లం కేసు  ఏకంగా రాష్ట్ర డీజీపీ నోటి వెంట రావ‌డంతో విజ‌య‌న‌గ‌రం జిల్లా ఎస్పీ రాజ‌కుమారీ….ఆ కేసును మ‌రింత‌ సీరియ‌స్ గానే తీసుకున్నారు.ఇందులో భాగంగా పండ‌గ  భోగీ అని చూడకుండా  జిల్లాలోని అన్ని స‌ర్కిల్ ఇన్ స్పెక్ట‌ర్ల‌తో సాయంత్రం సెట్ కాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించారు.

ప్ర‌ధానంగా నీలాచలం కొండ విగ్ర‌హ కేసు దృష్ట్యా అన్ని దేవాల‌యాల‌లో సీసీ కెమారాలు ఏర్పాటు చేయించాల‌ని…అందుకు త‌గిన చ‌ర్య‌ల‌ను తీసుకోవాల‌ని స‌ర్కిల్ ఇన్ స్పెక్ట‌ర్ల‌కు ఎస్పీ ఆదేశించారు. ఇదిలా ఉంటే స‌రిగ్గా రామతీర్దం నీలాచలం కొండ‌పై సీసీ కెమారాలు అమ‌ర్చుతార‌ని ఒక్క రోజు ముందుగానే  కొండ‌పై రాములోరి విగ్ర‌హ శిర‌స్సు ఖండ‌న జ‌ర‌గ‌డం…పోలీసుల‌నే క‌ల‌వ‌ర‌పెడుతోంది.

ఇప్ప‌టికే పోలీసులు 32 మందిని అదుపులో తీసుకుని విచారించారు కూడా.అయినా కేసు ద‌ర్యాప్తు ముందుకు సాగ‌లేదు. దీంతో మున్ముందు దేవాల‌యాల‌లో ఇలాంటి సంఘ‌ట‌న‌లు జ‌ర‌గ‌కుండా ఉందేందుకు ముందుగానే చ‌ర్య‌లు తీసుకునే విధంగా అన్ని దేవాల‌యాల‌లో సీసీ కెమారాలు ఏర్పాటు చేయించాల‌ని శాఖా సిబ్బందికి ఎస్పీ ఆదేశించారు.

 ప్ర‌ధానంగా విజ‌య‌న‌గ‌రంలో కొన్ని ప్ర‌ముఖ దేవాల‌యాల‌లో సీసీ  కెమారాలు అర్చేందుకు  ప్ర‌ముఖ  వ్యాపారి,బీజేపీ నేత కుసుమంచి సుబ్బారావు ముందుకొచ్చినట్టు…న‌గ‌ర  వ‌న్ టౌన్ సీఐ ముర‌ళీ డేటూడే న్యూస్.ఇన్ ప్ర‌తినిధికి తెలియ చేసారు.

ఏదైనా రామ‌తీర్ధం నీలాచ‌లం ఘ‌ట‌న కేసు ఛేధింపు పోలీసుల‌కు స‌వాలుగా మారింద‌నే చెప్పాలి.

Related posts

1 నుంచి ఏపీలో నూతన మద్యం విధానం

Satyam NEWS

ములుగు శ్రీ క్షేత్రంలో శ్రావణ మాస మొదటి శుక్రవారం పూజలు

Satyam NEWS

రైతులకు నష్టం కలిగించే చట్టాన్ని ఉపసంహరించుకోవాలి

Satyam NEWS

Leave a Comment