31.2 C
Hyderabad
May 3, 2024 01: 35 AM
Slider ప్రపంచం

చైనాలో విచ్చలవిడిగా పెరుగుతున్న కరోనా కేసులు

#corona

చైనాలో కరోనా ఇన్ఫెక్షన్ అదుపులేనంతగా పెరిగిపోతున్నది. ఆసుపత్రులు వ్యాధి సోకిన రోగులతో నిండిపోయాయి. రోజురోజుకు కొత్త కేసులు పెరుగుతున్నాయి. ఒక లెక్క ప్రకారం, ప్రస్తుతం చైనాలో 54 లక్షల మందికి పైగా కరోనా రోగులు ఉన్నారు. మరోవైపు ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి ఓ షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. చైనా తన జీరో కోవిడ్ విధానాన్ని ఉపసంహరించుకున్నప్పటి నుండి ఆసుపత్రిలో చేరిన కొత్త రోగుల డేటాను అది పంపలేదు. చైనా ఈ చర్య మరోసారి ఆరోగ్య నిపుణులను ఆందోళనకు గురి చేసింది.

కరోనా ఇన్‌ఫెక్షన్‌కు సంబంధించిన సమాచారాన్ని చైనా మళ్లీ దాచిపెడుతుందని నిపుణులు భయపడుతున్నారు. ఈ సమయంలో పెరుగుతున్న కేసులతో అధికారులు ఇబ్బందులు పడుతుండడమే డేటాను పంపకపోవడానికి కారణమని WHO తెలిపింది. డిసెంబర్ 4 నాటికి ఈ కేసులు 28,859 ఉన్నాయి. ఇది గత మూడేళ్లలో చైనాలో అత్యధికం. అయితే డిసెంబర్ 7న జీరో కోవిడ్ విధానం నుంచి చైనా వెనక్కి తగ్గింది. అప్పటి నుంచి చైనా నుంచి డబ్ల్యూహెచ్‌ఓకు ఎలాంటి సమాచారం అందలేదు.

చైనా ఎప్పుడూ కరోనా ఇన్‌ఫెక్షన్‌ను తక్కువ చేసి చూపించింది. చైనాలోని బీజింగ్, గ్వాంగ్‌జౌ, షెన్‌జెన్, షాంఘై నగరాల్లో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం చైనాలో కరోనా పెరుగుతున్నందువల్ల ఒత్తిడి ఎక్కువ అయింది. ఎపిడెమియాలజిస్ట్ ఝాంగ్ నాన్షాన్ కూడా ఒమిక్రాన్ వైరస్ సాధారణ జలుబు తప్ప మరేమీ కాదని, కాబట్టి భయపడవద్దు అని చెబుతున్నారు.

జీరో-కోవిడ్ విధానాన్ని సడలించినప్పటి నుంచి, ఆసుపత్రులలో పడకలు సరిపోవడం లేదు. ఆసుప్రతుల మర్చురీలు మృతదేహాలలో పరిస్థితి భయంకరంగా ఉంది. ప్రస్తుతం 5.4 మిలియన్లకు పైగా కరోనా సోకిందని, ఈ నెలాఖరు నాటికి వారి సంఖ్య 12.5 మిలియన్లకు పెరుగుతుందని షాంఘై డైసీ హాస్పిటల్ బుధవారం తన అధికారిక WeChat ఖాతాలో తెలిపింది.

Related posts

సిఎం జగన్ కు విశ్వహిందూ పరిషత్ అల్టిమేటమ్

Satyam NEWS

వరుసగా ఏడో రోజూ పెరిగిన పెట్రోలు

Satyam NEWS

మరో రేప్ అండ్ మర్డర్: ఎన్ కౌంటర్ చేస్తున్నా బుద్ధి లేదు

Satyam NEWS

Leave a Comment