37.2 C
Hyderabad
May 2, 2024 14: 06 PM
Slider హైదరాబాద్

కరోనా ఎఫెక్ట్: ప్రయివేటు హాస్టల్ విద్యార్ధులకు ఉచిత భోజనం

food packets

కూకట్ పల్లి సర్కిల్ పరిధిలోని సర్ధార్ పటేల్ నగర్ లో ఉన్న ఒక ప్రయివేటు హాస్టల్ యాజమాన్య నిర్లక్ష్యం కారణంగా  రెండు రోజులుగా భోజనం లేకుండా ఉన్న విద్యార్ధులను మాత యోగ అన్నపూర్ణేశ్వరి చారిటబుల్ ట్రస్ట్ ఆదుకుంది. యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగా రెండు రోజుల పాటు విద్యార్ధులు ఆకలితో అలమటించారు.

యాజమాన్యం విద్యార్థులకు భోజన వసతి ఏర్పాటు చేయక పోవడంతో  విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దీంతో  కేపి ఎచ్ బీ పోలీస్ స్టేషన్  హౌస్ ఆఫీసర్ లక్ష్మినారాయణ సలహాతో శ్రీ మాత యోగ అన్నపూర్ణేశ్వరి చారిటబుల్ ట్రస్ట్  నిర్వహకులు జగన్ గురూజీ ని వారు సంప్రదించారు.

దీంతో ట్రస్ట్ ఆధ్వర్యంలో 40 మంది విద్యార్థులకు నాణ్యమైన భోజన వసతి ని ఏర్పాటు చేశారు. అదే విధంగా లాక్ డౌన్ కారణంగా అనేక ప్రాంతాల్లో ఆహారం అందక ఇబ్బందులు ఎదురవ్వడంతో శ్రీ మాత యోగా అన్నపూర్ణేశ్వరి చారిటబుల్ ట్రస్ట్ నిర్వహకులైన జగన్ గురూజీ ఆధ్వర్యంలో అన్న దాన ప్రసాదం ను  ఏర్పాట్లు చేశారు.

మియపూర్, హైదర్ నగర్, కేపి ఎచ్ బీ పోలీస్ స్టేషన్, సీబీ సీఐడీ కాలనీ, జగద్గిరిగుట్ట ప్రాంతాల్లో ఉన్న ఆహారం లేని 500 మందికి నాణ్యమైన భోజనాలను ఏర్పాటు చేశారు.

ఈ కార్యక్రమంలో ట్రస్ట్ వ్యవస్థాపక  నిర్వహకులు జగన్ గురూజీ తో పాటు జర్నలిస్ట్ లక్ష్మణ్ ప్రసాద్, ట్రస్ట్ సభ్యులు ‘న్యూ ఎరా’ పాఠశాల నిర్వహకులు  వేణుగోపాల్ రెడ్డి, రాజు గౌడ్, శ్రీనివాస్, సురేందర్ రెడ్డి, హేమాద్రి, ఉమేష్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

నకిలీ విత్తనాలతో నష్టపోయిన సోయా రైతులు

Satyam NEWS

స‌త్య‌దేవ్‌, సి. క‌ల్యాణ్ కాంబినేష‌న్ ఫిల్మ్ టైటిల్ ‘గాడ్సే’

Satyam NEWS

టాస్క్ ఫోర్సు దాడుల్లో ముగ్గురు ఎర్రచందనం స్మగ్లర్లు అరెస్టు

Satyam NEWS

Leave a Comment