30.7 C
Hyderabad
April 29, 2024 03: 44 AM
Slider సినిమా

మలయాళ హీరో సురేష్ గోపిపై ఛార్జ్‌షీట్

suresh gopi

వాహనాల రిజిస్ట్రేషన్ కుంభకోణంలో నటుడు, బిజెపి నాయకుడు సురేష్ గోపిపై క్రిమినల్ చార్జిషీట్ దాఖలు చేశారు.  పన్ను ఎగవేతతో పాటు, అతనిపై మోసం, ఫోర్జరీ ఆరోపణలు ఉన్నాయి. ఈ నేరాలు రుజువు అయితే ఏడు సంవత్సరాల వరకు జైలు శిక్ష విధిస్తారు. పుదుచ్చేరి చావాడి అపార్ట్‌మెంట్‌లో తాత్కాలిక నివాసిగా 2010 లో కారు కొన్న సురేష్ గోపి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు.

నకిలీ చిరునామాల నమోదు ద్వారా రూ.16 లక్షల వరకూ పన్ను ఎగ్గొట్టారని ఆయనపై అభియోగం నమోదు అయింది.  రిజిస్ట్రేషన్ కోసం తప్పుడు అఫిడవిట్ నకిలీ స్టాప్ ఉపయోగించానని చార్జిషీట్ లో పేర్కొన్నారు. ఇచ్చిన చిరునామాలో సురేష్ గోపి నివసించేవారు కాదని భవనం యజమాని చెప్పడంతో కేసు నమోదు చేశారు.

సురేష్ గోపిని అరెస్టు చేసి తర్వాత బెయిల్ పై విడుదల చేశారు. నటులు ఫహద్ ఫాజిల్, అమలా పాల్ పై కూడా వాహన రిజిస్ట్రేషన్ మోసం ఆరోపణలు ఉన్నప్పటికీ తరువాత తొలగించారు.  బెంగళూరు నుంచి వాహనం కొన్న అమలపై కేరళ పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు.

Related posts

డెత్ టోల్: కరోనా ఎఫెక్టు కన్నా ఆవేదన ఎఫెక్టు ఎక్కువ

Satyam NEWS

మై స్టోరీ:నా భర్తను నాకన్నతల్లే పెళ్లాడితే యువతీ ఆవేదన

Satyam NEWS

కరోనా నుంచి ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసమే లాక్ డౌన్

Satyam NEWS

Leave a Comment