42.2 C
Hyderabad
May 3, 2024 18: 32 PM
Slider ఆదిలాబాద్

పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

Cotton

నిర్మల్ పట్టణం లోని కేదార్‌నిధ్‌ జిన్నింగ్ మిల్లులో వ్యవసాయ మార్కెట్ కమిటి , సీసిఐ (Cotton Corporation of India) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పత్తి కొనుగోలు కేంద్రాన్ని సీసిఐ అధికారులతో కలిసి బుధవారం రాష్ట్ర మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ప్రారంభించారు.

రైతుల సంక్షేమ‌మే ప్ర‌భుత్వ ధ్యేయం..


ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం చిత్తశుద్ధితో పనిచేస్తుందని రైతులు పండించిన ప్రతి పంటకు గిట్టుబాటు ధర కల్పించి ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని అన్నారు.


ఆదిలాబాద్ ప‌త్తికి మంచి డిమాండ్‌


దేశంలోనే ఆదిలాబాద్ జిల్లా పత్తికి మంచి పేరు ఉందని సాక్షాత్తు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా ప్రస్తావించారని తెలిపారు.. తెలంగాణ ప్రభుత్వం రైతుల కోసం రైతుబంధు, రైతు బీమా, 24 గంటల కరెంటు లాంటి పథకాలను ప్రవేశ పెట్టిందన్నారు. నిర్మల్ జిల్లాలో 24 కేంద్రాలు ఉండగా నిర్మల్ లో మొదటి పత్తి కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేశారన్నారు. పత్తి కోనుగోలు కేంద్రం ప్రారంభోత్సవం అనంతరం అధికారులతో కలిసి పత్తి ని పరిశీలించారు.


రైతుల జాగ్ర‌త్త‌ల‌తో నాణ్య‌త ప్ర‌మాణాల పెరుగుద‌ల‌


మన దేశంలో పత్తి ధర మిగతా దేశాలతో పోలిస్తే ఎక్కువగా ఉందని రైతులు కొద్ది పాటి జాగ్రత్తలు తీసుకుంటే నాణ్యత ప్రమాణాలు కలిగిన పత్తి దిగుబడి వస్తుందని సీసిఐ కూడా ఇబ్బందులు లేకుండా పత్తి కోనుగోలు చేయడం జరుగుతుందని అన్నారు. కాగా పత్తి ధర క్వింటాలకు రూ.5825 నిర్ణయించారు.

Related posts

పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఒక బ్లాక్ మెయిలర్

Satyam NEWS

28 లక్షల తో కంటోన్మెంట్ స్విమ్మింగ్ పూల్ ఆధునికీకరణ…!

Satyam NEWS

చిరంజీవి సినిమాను ఎత్తేసిన ధియేటర్ ఎదుట ఆందోళన

Satyam NEWS

Leave a Comment