33.7 C
Hyderabad
April 27, 2024 23: 11 PM
Slider నల్గొండ

రైతు కూలీలకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలి

#AIKMS Suryapet

లాక్ డౌన్ విధించి రెండు నెలలు దాటినప్పటికీ కరోనా మరణాల సంఖ్య ఇంకా పెరుగుతూనే ఉందని, దేశం ఆర్థికంగా కూడా నష్టపోతుందని సిపిఐ (ఎమ్ ఎల్) న్యూ డెమోక్రసీ అభిప్రాయపడింది.

లాక్ డౌన్ లో పనులు లేక,తిండి దొరక్క ఆకలి చావులు కరోనా మరణాలతో పోటీపడుతున్నాయని, కేంద్రం ప్రకటించిన ఆత్మ నిర్భర్ 20 లక్షల కోట్ల రూపాయల ప్యాకేజీలో కేవలం 1.5 లక్షల కోట్ల రూపాయలు మాత్రమే ప్రజలకు అందేట్లుగా ఉండవచ్చునని బార్ క్లేస్  నివేదిక తెలిపిందని అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కోటేశ్వరరావు అన్నారు.

దీన్ని దుర్భర ప్యాకేజీగా ఆయన అభివర్ణించారు. అధిక మొత్తం విదేశీ, స్వదేశీ కార్పొరేట్ భూస్వాములకు చేరుతుందని అందుకే సిపిఐ (mL) న్యూ డెమోక్రసీ అఖిల భారత రైతు కూలీ సంఘం తమ డిమాండ్లను రూపొందించిందని ఆయన అన్నారు.

ఈ డిమాండ్లను అమలు చేయాలని, లేనిపక్షంలో ఆందోళన చేపడుతుందని అన్నారు.

1. రైతులు, కూలీలు, చేతివృత్తుల వారికి covid-19 ప్రత్యేక ప్యాకేజీ కింద తిరిగి వారికి ఉపాధి దొరికే వరకు నెలకు పదివేల రూపాయలు ఇవ్వాలి.

2.రేషన్ కార్డులు ఉన్నా లేకపోయినా వలస కార్మికులకు రైతు కూలీలకు ప్రతి ఒక్కరికి నెలకు 15 కేజీల బియ్యం ఒక కిలో కందిపప్పు ఒక కిలో నూనె ఉచితంగా ఇవ్వాలి.

3. రైతాంగానికి రుణాలు రద్దు చేసి, వానాకాలం సాగుకు ఉచితముగా ఎరువులు, విత్తనాలు, వడ్డీలేని రుణాలు ఇవ్వాలి.

4. గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని 200 రోజులు పని కల్పించాలి.

5. చేతివృత్తుల వారికి మరియు కుటీర పరిశ్రమలకు కరెంటు బిల్లును రద్దు చేయాలి.

6. విద్యుత్,బొగ్గు,రక్షణ తదితర రంగాల ప్రైవేటీకరణను ఉపసంహరించుకోవాలి.

7. వైద్య రంగానికి జిడిపిలో ఐదు శాతం కేటాయించి ఉచిత వైద్యం అందించాలి.

8. పంటలకు నష్టం కలిగించే రాబోవు మిడతల దండు ప్రమాదాన్ని ముందుగానే అరికట్టాలి.

ఈ కార్యక్రమంలో అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కోటేశ్వరరావు, జిల్లా అధ్యక్షుడు పోటు లక్ష్మయ్య, జిల్లా నాయకులు కాకి అజయ్, మేకల నాగేశ్వరరావు, వెంకటేశ్వరరావు, ఉదయగిరి, నాగేశ్వరరావు, పి. వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Related posts

సింగరేణి కార్మికులకు దీపావళి బోనస్‌ 296 కోట్లు

Satyam NEWS

గీతం డిగ్రీ కళాశాలలో జాతీయ సైన్స్ దినోత్సవం

Satyam NEWS

మంత్రి గంగుల సమక్షంలో టిఆర్ఎస్ లో చేరిన యువకులు

Satyam NEWS

Leave a Comment