37.2 C
Hyderabad
May 2, 2024 14: 05 PM
Slider కర్నూలు

శ్రీశైలం దేవస్థానంలో కోవిడ్ నివారణ చర్యలు

srisailam-gopuram

శ్రీశైలం దేవస్థానంలో కరోనా నేపథ్యంలో స్వామివారి గర్భాలయ స్పర్శదర్శనం, అంతరాలయ దర్శనాలు నిలిపివేశారు. అదే విధంగా గర్భాలయ అభిషేకాలు, అమ్మవారి అంతరాలయ దర్శనం పూర్తిగా నిలుపుదల చేశారు. ఆన్లైన్ లో గర్భాలయ టికెట్లు పొందినవారికి, గర్భాలయ అభిషేకాలు పునః ప్రారంభం తరువాత కోరుకున్నరోజున అభిషేకం నిర్వహణకు వెసులుబాటు కల్పించారు. భక్తులందరికీ స్వామిఅమ్మవార్ల లఘు దర్శనానికి మాత్రమే అవకాశం ఉంటుంది. ఆలయంలో శఠారి, తీర్థం ఉచిత ప్రసాద వితరణను వేదాశీర్వచనం కూడా తాత్కాలికంగా నిలుపుదల చేశారు. గంటకు కేవలం 1000 మంది భక్తులను మాత్రమే దర్శనానికి అనుమతిస్తామని ఆలయ ఈవో లవన్న తెలిపారు. దేవస్థానం అన్నదానం, పాతాళగంగలో పుణ్యస్నానాలు రోప్ వే, బోటింగ్ పూర్తిగా నిలుపుదల చేశారు.

Related posts

ఉక్రెయిన్ రాజధానిని సందర్శించిన రిషి సునక్

Satyam NEWS

గ్యాస్ లీకేజీతో చెలరేగిన మంటలు.. ఏడుగురికి తీవ్రగాయాలు

Bhavani

ప్రపంచంలోనే అత్యంత శక్తిమతమైన దేశం చైనా

Satyam NEWS

Leave a Comment