37.2 C
Hyderabad
May 1, 2024 12: 14 PM
Slider గుంటూరు

కేంద్ర ప్రభుత్వం నిరంకుశ విధానాలపై పోరుబాట

#cpigovernmnt

మతోన్మాదం నుంచి దేశాన్ని రక్షించడం కోసం 14 ఏప్రిల్  నుండి ఏప్రిల్ 30వ తేదీ వరకు మంగళగిరి నియోజకవర్గం వ్యాప్తంగా జరిగే వామపక్షాల ఇంటింటి ప్రచార యాత్రను జయప్రదం చేయ వలసినదిగా సిపిఐ మంగళగిరి నియోజకవర్గ కార్యదర్శి చిన్ని తిరుపతయ్య  ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం రాజ్యాంగాన్ని రక్షించడం కోసం,  అధిక ధరా భారాలతో అల్లాడిపోతున్న ప్రజానీకాన్ని చైతన్యవంతం చేసి పోరాటాలకు సిద్ధం చేయడం కోసం సిపిఐ – సీపీఎం  జాతీయ సమితి పిలుపునిచ్చింది.

ప్రజా వ్యతిరేక ప్రభుత్వాలను ఇంటికి సాగనంపడం కోసం ఏప్రిల్ 14 డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయనకు ఘనంగా నివాళులు అర్పించి సభలు నిర్వహిస్తారు. మంగళగిరి పట్టణంలోని (వేములపల్లి శ్రీకృష్ణ భవన్లో) సిపిఐ కార్యాలయంలో   సిపిఐ  నియోజకవర్గ సమితి సమావేశంలో పాల్గొన్న నియోజకవర్గ కార్యదర్శి చిన్ని తిరుపతయ్య, సిపిఎం గుంటూరు జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎస్ఎస్ చెం గయ్య, సిపిఎం సీనియర్ నాయకులు పి బాలకృష్ణ ఈ విషయం వెల్లడించారు.

కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం నియంతృత్వ విధానాలతో దేశంలో ఉన్న బిజెపి యేతర ప్రభుత్వాలపై ఉక్కు పాదం మోపుతూ గవర్నర్ల చే ఆయా రాష్ట్ర ప్రభుత్వాలను కదలకుండా అనేక ఇబ్బందులు కలిగిస్తూ ప్రభుత్వాలు సాఫీగా నడవడంలో సహకరించకుండా అప్రజాస్వామికంగా వ్యవహరిస్తూ చట్ట ప్రకారం కేంద్రం నుంచి రావాల్సిన నిధులు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు  విడుదల చేయకుండా అనేక ఇబ్బందులకు గురిచేస్తోందని విమర్శించారు.

ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ కు విభజన హామీల ప్రకారం రావలసిన నిధులను విడుదల చేయకుండా, పోలవరం ప్రాజెక్టు పనులను ముందుకు కదలనియకుండా రాష్ట్ర అభివృద్ధికి రాజధాని కొరకు వెనుకబడిన జిల్లాల ప్రాంతాల అభివృద్ధి నిధులను విడుదల చేయకుండా మోకాలడ్డుతు రాష్ట్రాన్ని ఆర్థికంగా దివాలా తీసే విధానానికి పూనుకుందని అన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకపోగా రాష్ట్రంలో ఉన్న ఏకైక భారీ ఉక్కు పరిశ్రమను కార్పొరేట్ కంపెనీలకు బడా పెట్టుబడిదారులకు , అలాగే దేశంలోనే అనేక ప్రభుత్వ రంగ సంస్థలను అంబానీ, ఆదాని లాంటి వారికి ఉపయోగపడే విధంగా సముద్ర తీర ప్రాంతాలు పోర్టులు బొగ్గు గనులు ఇన్సూరెన్స్ కంపెనీలు ప్రైవేటు వ్యక్తులకు అప్పజెప్పేస్తోందని విమర్శించారు. 

రాష్ట్ర ప్రజలందరూ గత రెండు సంవత్సరాలుగా విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ పోరాడుతుంటే ఏమాత్రం వెనుకకు తగ్గని కేంద్రం ప్రైవేటీకరణ వైపు ముందుకు అడుగులు వేస్తోందన్నారు. బిజెపి అధికారంలోకి వస్తే వంద రోజుల్లో ధరలు మొత్తం తగ్గిస్తానని నల్లధనాన్ని వెనుకకు తీసుకొస్తానని రైతాంగానికి రెట్టింపు ఆదాయం చేస్తానని సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని,  దేశం మొత్తం ప్రజానీకం అధిక ధరాభారాలతో అల్లాడిపోతున్నారని పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలను విపరీతంగా పెంచి తమాషా చూస్తున్నారని ఆయన విమర్శించారు.

రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 25 మంది ఎంపీలను ఇస్తే రాష్ట్రానికి ప్రత్యేక హోదా తెస్తానని అందరికీ ఉద్యోగాలు సాధిస్తానని రాష్ట్రానికి అమరావతి రాజధానిగా ఉంటుందని రాష్ట్ర అభివృద్ధిని పరుగులు పెట్టిస్తానని చెప్పిన జగన్ మోహన్ రెడ్డి  ఢిల్లీ పెద్దల ముందు సాగిల పడుతున్నారని ఆయన విమర్శ చేశారు. రాష్ట్రంలో ప్రజలపై అధిక పనుల భారాలు మోపుతూ ఆర్టీసీ బస్సు చార్జీలు కరెంటు చార్జీలు ఇంటి పనులు నీటి పనులు చివరకు చెత్త పనులు కూడా పెంచి ప్రజలు నడ్డి విరిగే విధంగా పన్నుల భారాలు మోపారని అన్నారు.

పోలవరం ప్రాజెక్టు నిధులు తేలేక కేంద్రాన్ని నిలదీయలేక రాష్ట్ర అభివృద్ధి నిధులు అడగలేక కేంద్రం ముందు చతికిలబడ్డదని అన్నారు. అభివృద్ధిలో రాష్ట్రం పూర్తిగా వెనుకబడిందని పరిశ్రమలు రాక పారిశ్రామిక సంస్థలు లేక చదువుకున్న విద్యార్థులకు, నిరుద్యోగులకు ఉద్యోగాలు లేక  రాష్ట్రంలో నిరుద్యోగం తాండవిస్తోందన్నారు.  రాష్ట్రంలో ఉన్న టీడ్కో గృహాలను లబ్ధిదారులకు పంపిణీ చేయలేదని, జగనన్న కాలనీల పేరుతో ఏ ఒక్క పేదవారికి ప్రభుత్వ పరంగా ఇల్లు కట్టి ఇవ్వలేదని ఆయన విమర్శించారు.

అర్హులైన పేదలందరికీ ప్రభుత్వమే పక్కా గృహాలు నిర్మించి ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్రంలో అరాచక పాలన తాండవిస్తోందని ఎదిరించిన వారిపై ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు బనాయిస్తూ జైల్లో వేస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వ అక్రమ కేసులపై నిర్బంధాలపై ప్రజలు పోరాటాలకు సిద్ధం కావాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా కంటక ప్రజా వ్యతిరేక ప్రజాస్వామ్య రాజ్యాంగ విరుద్ధ విధానాలపై ప్రజలు కార్మికులు కష్టజీవులు రైతాంగం పోరాటాలకు సిద్ధం కావాలనీ పిలుపునిచ్చారు. 

ఏప్రిల్ 14 నుండి 30వ తేదీ వరకు జరిగే వామపక్షాల ప్రజా చైతన్య యాత్రలో ప్రజలందరూ పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ సహాయ కార్యదర్శి కంచర్ల కాశయ్య మండల కార్యదర్శి జాలాది జాన్ బాబు, తాడేపల్లి సహాయ కార్యదర్శి తుడుమెళ్ళ వెంకటయ్య, జవ్వాది సాంబశివరావు, ఏఐటీయూసీ నియోజకవర్గ కార్యదర్శి చిన్ని సత్యనారాయణ, ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు పిల్లలమర్రి నాగేశ్వరరావు, ఉడత శ్రీనివాసరావు, సిపిఎం నాయకులు గని తదితరులు పాల్గొన్నారు.

Related posts

వచ్చే ఉగాదికి ‘టీఎఫ్‌సీసీ-నంది సౌత్‌ ఇండియా ఫిలిం అవార్డ్స్‌

Bhavani

ప్రజల్ని మభ్య పెట్టేందుకే పోలవరం సందర్శన డ్రామా

Satyam NEWS

ఇంకో ప్రాణం తీసిన టిక్ టాక్ సరదా!

Satyam NEWS

Leave a Comment