24.2 C
Hyderabad
October 14, 2024 21: 14 PM
Slider తెలంగాణ

ఇంకో ప్రాణం తీసిన టిక్ టాక్ సరదా!

pjimage (9)

టిక్ టాక్ వలన ఎన్నో ప్రమాదాలు  జరుగుతున్నా యువత జాగృతం కావడం లేదు. తాజాగా నిజామాబాద్ జిల్లా భీంగల్ మండలంలో టిక్ టాక్ చేస్తూ ఓ యువకుడు మృతి చెందాడు. దినేష్ అనే యువకుడు గోను గొప్పుల శివారులోని కప్పుల వాగు చెక్ డ్యామ్‌లో టిక్ టాక్ చేస్తూ.. నీటి ప్రవాహంలో కొట్టుకు పోయాడు. తన ఇద్దరు స్నేహితులు టిక్ టాక్ వీడియో రికార్డు చేస్తుండగా దినేష్ ఆ నీటిలో నటిస్తూ కొట్టుకుపోయాడు. రెండు రోజుల క్రితం ఈ ఘటన జరగ్గా ఆదివారం అతని మృతదేహం లభ్యమైంది. టిక్ టాక్ వల్లే తమ కుమారుడి ప్రాణం పోయిందని కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. o

Related posts

జారి పడబోతే చేయి పట్టుకున్నారు

Murali Krishna

ములుగులో తెలంగాణ జాగృతి సంక్రాంతి సంబరాలు

Bhavani

మారుమూల గ్రామానికి చెందిన వ్యక్తికి IRS క్యాడర్

Satyam NEWS

Leave a Comment