42.2 C
Hyderabad
May 3, 2024 15: 39 PM
Slider ముఖ్యంశాలు

ఇంటి నిర్మాణ అనుమతుల జాప్యం: 29 అధికారులకు జరిమానా

#arvindkumarias

రాష్ట్రంలో భవననిర్మాణ అనుమతులను సకాలంలో అందించాలన్న TSbPASS చట్టానికి విరుద్ధంగా అనుమతులకై దరఖాస్తులు అందిన 15 రోజులను మించినా  అనుమతులు జారీ చేయని 29 మంది  మున్సిపల్ కమీషనర్లు, సైట్, టెక్నీకల్ వెరిఫికేషన్ అధికారులకు ఒక్కొక్కరికి రూ. 3000 ల జరిమానా విధించి, వారి జీతాలనుండి రికవరీ చేయాలని రాష్ట్ర మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్ ఆయా జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. భవన నిర్మాణ అనుమతుల జారీ లో నిర్దారిత సమయాన్ని మించి జాప్యం చేసిన అధికారుల వివరాలను జిల్లా కలెక్టర్ ల అధ్యక్షతన గల జిల్లా స్థాయి TSbPASS కమిటీలు ప్రభుత్వానికి పంపిన నివేదికను ప్రభుత్వం సమీక్షించింది, ఈ జాప్యానికి కారణమైన నలుగురు మున్సిపల్ కమీషనర్లు,13 మంది సైట్ టెక్నీకల్ వెరిఫికేషన్ అధికారులు, 10 మంది సైట్ వెరిఫికేషన్ అధికారులకు జరిమానా విధించాలని ఆదేశించినట్టు అర్వింద్ కుమార్ పేర్కొన్నారు. ఈ మేరకు హన్మకొండ, మేడ్చల్, మహబూబ్ నగర్, రంగారెడ్డి, సూర్యాపేట, వరంగల్ , యాదాద్రి జిల్లాల కలెక్టర్లను ఆదేశిస్తూ రాసిన లేఖలో అర్వింద్ కుమార్ పేర్కొన్నారు.

Related posts

అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడేషన్ ఇస్తాం

Satyam NEWS

పొత్తులకు సిద్ధం: చంద్రబాబు కీలక ప్రకటన

Satyam NEWS

ఉహాన్‌ కరోనా:వైద్య చికిత్సకై 450 మంది సైనిక డాక్టర్లు

Satyam NEWS

Leave a Comment