27 C
Hyderabad
May 10, 2024 05: 55 AM
Slider హైదరాబాద్

రాష్ట్రాలకు అధిక నిధులను కేటాయించాలి

#CPI ECIL

కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు యుద్ధ ప్రాతిపదికన అధిక నిధులను మంజూరు చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వి.ఎస్.బోస్  డిమాండ్ చేశారు. సీపీఐ జాతీయ సమితి పిలుపు లో భాగంగా ఇసీఐఎల్ లోని నీలం రాజశేఖర్ రెడ్డి భవన్( సీపీఐ జిల్లా కార్యాలయం) లో ఒక రోజు  నిరసన దీక్ష కార్యక్రమం చేపట్టారు.

ఈ సందర్భంగా బోస్  మాట్లాడుతూ  కరోనా మహమ్మారి దేశంలో విలయతాండవం చేస్తున్న నేపథ్యంలో వలస కార్మికులు, కార్మికులు, ఆటో, బిల్డింగ్, అసంఘటిత రంగ కార్మికులకు నెలకు 7వేలు రూపాయలు చెల్లించాలని కోరారు. ప్రైవేట్ విద్యా, వైద్య శాఖలలో పని చేస్తున్న ఉద్యోగుల వేతనాలు, ఉద్యోగ భద్రత కల్పించాలని, నిరుద్యోగ భృతి 10వేలు ఇవ్వాలని, ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థలను జాతీయం చేయాలని ఆయన కోరారు.

రైతుల ధాన్యం తూకంలో మోసాన్ని అరికట్టాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అదే విధంగా కేంద్రం ప్రభుత్వం,  దేశ వ్యాప్తంగా ఉన్న వలస కార్మికులను  తమ తమ రాష్ట్రాలకు, జిల్లాలకు పంపే ఆదేశాలు జారీచేసింది, కానీ ఒక నిర్దిష్టమైన ప్రణాళికా చేయకుండా, రాష్ట్ర ప్రభుత్వాలతో  సమన్వయం చేసేలా, కార్మికులను మండల తహసీల్దార్ పర్యవేక్షణలో , నివేదిక ఆధారంగా రైళ్లలో తరలించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

లేకుంటే వైరస్ మహమ్మరిలా ప్రబలే ఆస్కారాలు ఉందని, కాబట్టి తక్షణమే వలస కార్మికుల జాబితాను తయారు చేయాలని వారు డిమాండ్ చేశారు. సీపీఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు జీ. దామోదర్ రెడ్డి, ఏఐటీయూసీ మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు ఎస్. శంకర్ రావు, AIYF జిల్లా సహాయ కార్యదర్శి ధర్మేంద్ర, ECIL ఎంప్లాయిస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి నర్సింహా, AISF జిల్లా అధ్యక్షుడు విశాల్ నిరసన దీక్ష లో పాల్గొన్నారు.

Related posts

పంజాబ్ లో కొత్త మంత్రివర్గం..చన్నీ బృందంలో 15 మంది

Sub Editor

రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి

Bhavani

ఖాకీ ఛీటింగ్: అమ్మాయిని ట్రాప్ చేసిన పోలీసు అధికారి

Satyam NEWS

Leave a Comment