33.7 C
Hyderabad
April 29, 2024 02: 47 AM
Slider ముఖ్యంశాలు

కరోనా సాకుతో దోచుకున్నోడికి దోచుకున్నంత

#Corporate Companies

కరోనా మహమ్మారి  విజృంభిస్తున్న తరుణంలో మనదేశంలో చాలామంది నాయకులు ధనవంతులు మధ్యతరగతి వారు  నిరుపేద వారికి వారికి తోచినంత సహాయం చేస్తూ వారికి కావలసిన నిత్యావసర వస్తువులు సమకూరుస్తూ తమ మానవత్వాన్ని చాటుకుంటూ ఉండగా కొన్ని కంపెనీలు ఇదే అనువుగా చూసుకొని ప్రజలను దోచుకుంటున్నాయి.

మానవత్వం లేని బహుళజాతి కంపెనీలు

 స్వదేశీ కంపెనీలు తమ వంతుగా కరోనా మహమ్మారి తరిమేందుకు ముఖ్యమంత్రుల ప్రధానుల సహాయనిధికి తోడు పడుతున్నారు. కానీ మన దేశంలో  బ్రతుకుతూ మన దేశంలో వ్యాపారం చేసుకుంటున్న బహుళ జాతి కంపెనీలు మానవత్వం లేకుండా పోవడంతో పాటు ఇదే అదునుగా చూసుకొని నూటికి ఐదు రూపాయల నుండి పది రూపాయల వరకు ధరలు అమాంతం పెంచేసి వారి వ్యాపారాన్ని కొనసాగిస్తూ దేశాన్ని కొల్లగొడుతున్నారు.

నిత్యవసర వస్తువులు పెంచి అమ్మ రాదని ప్రభుత్వం చెప్పినా నిమ్మకు నీరెత్తినట్టు కంపెనీలు వ్యవహరిస్తున్నాయి. సానిటైజర్లు మాస్కులు హ్యాండ్ వాష్ సబ్బులు మొదలగు ప్రస్తుత అత్యవసర, టీ పౌడర్లు, మొదలగు నిత్యవసర వస్తువుల ధరలు తయారీదారు సిఫార్సు చేసిన  ధరను అమాంతం పెంచేశారు. వీరికి మానవత్వమే లేకుండా పోయింది. కనీసం విశ్వాసం కూడా లేకుండా పోయింది.

తగ్గిపోయింది కేవలం రైతు అమ్మే కూరగాయల ధరలే

ప్రస్తుత పరిస్థితుల్లో దేశ వెన్నుముక అయిన రైతన్న పండిస్తున్న కూరగాయలు అత్యధికంగా ధరలు  తగ్గాయి తప్పితే అన్ని వస్తువుల ధరలు కొండెక్కాయి. ఇదే అదునుగా చూసుకున్న కొందరు వ్యాపారులు ఎమ్మార్పీ ధరల కంటే అదనంగా వసూలు చేస్తున్నారు. సిగరెట్లు గుట్కాలు కూల్డ్రింక్స్ అయితే చెప్పనక్కర్లేదు 15 రూపాయల వస్తువు అరవై రూపాయలు అంతకు అంతకు అంతా దోచుకుంటున్నారు.

రేపు ఉంటామో పోతామో తెలియని పరిస్థితుల్లో మానవాళి మానవత్వం కోల్పోతున్నారు. ఇలా ప్రస్తుత కరోనా మహమ్మారి  విజృంభిస్తున్న దశలో ఎవరికి వారు దోచుకుంటున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వం చొరవ చూపిస్తే తప్ప ఈ దోపిడిని అరికట్టి మార్గం లేదు.

Related posts

కరోనాపై యుద్ధానికి మహేష్ బాబు కోటి విరాళం

Satyam NEWS

అభివృద్ధికి అందరు అధికారులు సహకరించాలి

Satyam NEWS

ట్రాజెడీ టూర్:లోయలో బస్సు బోల్తా 9మంది మృతి

Satyam NEWS

Leave a Comment