40.2 C
Hyderabad
May 2, 2024 18: 54 PM
Slider కడప

ప్రజల పై భారం మోపే జీవోలను ప్రభుత్వం ఉపసంహరించుకోవాలి

#rajampet

కడప జిల్లా రాజంపేట మున్సిపల్ కార్యాలయం వద్ద శుక్రవారం రాష్ట్ర సమితి పిలుపు మేరకు సిపిఐ అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు.

రాష్ట్ర ప్రభుత్వం ప్రజల పైన భారం మోపే ఇంటి పన్ను,చెత్త పన్ను, నీటి పనులను పెంచుతూ జారీచేసిన జీవో నెంబర్ 196,197,198 లను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో CPI ,CPM, కాంగ్రెస్ పార్టీ,భవన యజమానుల సంఘం , AITUC, CITU, PDSU తదితర సంఘాలు పాల్గొన్నాయి.

సిపిఐ ఏరియా కార్యదర్శి పి మహేష్ , సిపిఎం ఏరియా కార్యదర్శి C.రవికుమార్, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ నాయకులు పూల భాస్కర్, ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షులు ఎమ్మెస్ రాయుడు, భవన యజమానుల సంఘం S.రాజాచారి, సిపిఐ నియోజకవర్గ నాయకులు ఎం శివరామకృష్ణ దేవరా, సిఐటియు మండల కన్వీనర్ నరసింహ పి డి ఎస్ యు జిల్లా అధ్యక్షులు నాగేశ్వర్ కాంగ్రెస్ నాయకులు భాష కాంగ్రెస్ నాయకులు అల్తాఫ్, సన్నీ , చిన్న పెంచలయ్య తదితర నాయకులు పాల్గొన్నారు.

అనంతరం నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేయలేక ప్రజలపై పన్నులు మోపి వసూలు చేయాలనుకోవడం చాలా దురదృష్టకరమని ప్రజలు ప్రభుత్వాన్ని నమ్మి రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీకి మెజార్టీ ఇచ్చారని, ఎన్నికలు పూర్తయి పాలకమండళ్లు ఏర్పాటవగానే రాష్ట్రంలోని మునిసిపాలిటీలు, కార్పొరేషన్లలో ఆస్తిపన్ను, చెత్తపన్ను, నీటిపన్ను, యూజర్ చార్జీల పెంపు వంటి అనాలోచిత నిర్ణయాల అమలుకు తీర్మానాలు చేయడం సరికాదన్నారు.

పన్నులు గురించి బొత్స సత్యనారాయణ అవాస్తవాలు చెబుతూ ప్రజలను మభ్య పెట్టాలని చూస్తున్నారు అని రాష్ట్ర ప్రభుత్వం పట్టణ ప్రజల పై ఆస్తి విలువ ఆధారంగా పన్నుల భారం మోపుతూ జీవో నెంబర్ 196, 197 , 198 లను తీసుకువచ్చి ప్రజల నడ్డి విరిచే ప్రయత్నం చేస్తున్నది అని అన్నారు.ఇప్పుడు పట్టణ ప్రజలపై విలువ ఆధారంగా ఆస్తిపన్ను పెంచడం, చెత్తపన్ను కేటగిరీలుగా పెంచడం. మంచినీటి చార్జీలు, యూజర్ చార్జీలను పెంచాలను కోవడం దురదృష్టకరమని అన్నారు.

మున్సిపాలిటీలలో రూ.60, స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీలలో రూ.90, కార్పొరేషన్లలో నెలకు రూ.120 చొప్పున ప్రతి కుటుంబానికి అద్దెలకు ఉండే వారితో సహా పెంచుతూ నోటీసులు జారీ చేయడం దుర్మార్గంగా పేర్కొన్నారు.కుటుంబాలపై ఏడాదికి రూ.750 నుంచి రూ.1,450 వరకు అదనంగా పన్నుల భారం పడుతోందన్నారు.

పారిశుద్ధ్య నిర్వహణ నుంచి పూర్తిగా తప్పు కుంటూ చెత్తపై పన్ను వేయడం దుర్మార్గమని అన్నారు. దేశంలో గత రెండు సంవత్సరాలుగా కరుణ మహమ్మారి తో ప్రజలు అల్లాడిపోతావుంటే ఇటువంటి పరిస్థితులలో ఆస్తి పన్నులు పెంచాలి అనుకోవడం తగదన్నారు వెంటనే పెంచ దలచిన ఆస్తిపన్ను విరమించుకోవాలని డిమాండ్ చేశారు.

ప్రజలపై భారాలు పడే పనులను విరమించునేంతవరకు కలిసొచ్చే పార్టీలు ప్రజా సంఘాలను శక్తులను కలుపుకొని పోరాటాలు నిర్వహిస్తామని వారు అన్నారు.

అనంతరం మునిసిపల్ డిఈ వేణుగోపాల్ వినతి పత్రం అందజేశారు.

Related posts

బీజేపీ నాయకుడి ఇంటిపై కొనసాగుతున్న సీబీఐ దాడులు

Satyam NEWS

శ్రీ రామ జన్మభూమి ట్రస్ట్ నిధికి విరాళం అందించిన గజ్జి ప్రభాకర్

Satyam NEWS

ఎనాలసిస్: సారూ ఇంకా ఉంచుతారా? ఇక ఎత్తుతారా?

Satyam NEWS

Leave a Comment