37.2 C
Hyderabad
May 2, 2024 14: 44 PM
Slider నల్గొండ

3 కోట్ల రూపాయలతో గ్రామ గ్రామనా నూతన సిసి రోడ్లకు శంకుస్థాపన

#saidireddy

గ్రామాలను అన్ని రంగాలలో అభివృద్ధి చేయడం ప్రభుత్వం లక్ష్యమని హుజూర్ నగర్ శాసనసభ్యుడు శానంపూడి సైదిరెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ మఠంపల్లి మండలం లోని 14 గ్రామాలకు ఎస్ డి ఎఫ్ నిధుల  నుండి 3 కోట్ల రూపాయలతో   గ్రామాల సి సి రోడ్లకు సోమవారం శంకుస్థాపన చేశారు.మఠంపల్లి మండలంలోని యతవాకిళ్ళ, కామచికుంట తండా,బిల్యా నాయక్ తండా,దొనబండ తండా,తుమ్మల తండా,కొత్త తండా,జమ్లా తండా,లాలి తండా,అంజలీపురం,నిమ్మ తండా  గ్రామంలో కోట్ల రూపాయల తో  సి సి రోడ్లులను శానంపూడి సైదిరెడ్డి  ప్రారంభించారు.

ఈ సందర్భంగా సైదిరెడ్డి మాట్లాడుతూ గ్రామాలలో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తానని అన్నారు.గ్రామ గ్రామన నూతన సి సి రోడ్లు,డ్రైనేజ్ లకు ప్రభుత్వం నిధులు మంజూరు చేయడం జరిగిందని తెలిపారు. గతంలో ఏ ప్రభుత్వం పట్టించుకోలేదని,ప్రజలకు ఇబ్బందులు లేకుండా టిఆర్ఎస్ ప్రభుత్వం పని చేస్తుంది అని అన్నారు. గ్రామాలలో వైకుంఠ దామలు, డంపింగ్ యర్డ్స్,పల్లె ప్రకృతి వనం పనులను నాణ్యతతో పూర్తి చెయ్యడం జరిగిందని అన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం గ్రామాలను సర్వతోముఖాభివృద్ధి చేస్తుందని తెలిపారు. ఒకప్పుడు గ్రామాల్లో సర్కారు  చెట్లతో దర్శనమిచ్చేవని,ఇప్పుడు తెలంగాణలో ప్రతి గ్రామం పచ్చని చెట్లతో,పకృతి వనాలతో ప్రశాంత వాతావరణంలో ఉన్నాయని అన్నారు. తెలంగాణ రాకముందు తెలంగాణ వచ్చిన తర్వాత గ్రామాల రూపురేఖలు మారాయని అన్నారు.

గ్రామాలలో ప్రతి ఇంటికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్నాయి అని తెలిపారు. పేదింటి బిడ్డ పెళ్లికి లక్షా 116 రూపాయల కల్యాణ లక్ష్మి,షాదీ ముబారక్ పథకం ద్వారా అందిస్తున్న ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అని అన్నారు.పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని సైదిరెడ్డి అన్నారు. గాంధీజీ కలలుగన్న గ్రామస్వరాజ్యం తెలంగాణలో కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుందని, అభివృద్ధి సంక్షేమమే లక్ష్యంగా బంగారు తెలంగాణ రాష్ట్రంగా ప్రభుత్వం పని చేస్తుందని అన్నారు.గ్రామాలు సమగ్రంగా అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో పని చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు టిఆర్ఎస్ పార్టీ నేతలు,కార్యకర్తలు, అభిమానులు,ప్రజలు పాల్గొన్నారు.

సత్యం న్యూస్, హుజూర్ నగర్

Related posts

హైదరాబాద్ లో రెండు గంటల హై ఎలర్ట్

Satyam NEWS

మహిళలు జగన్ ప్రభుత్వంపై తిరగబడాలి

Bhavani

ఇంటివ‌ద్ద‌కే రేష‌న్ పంపిణీ: సిద్దమ‌వుతున్న రెవిన్యూ యంత్రాంగం

Satyam NEWS

Leave a Comment