38.2 C
Hyderabad
May 2, 2024 22: 32 PM
Slider హైదరాబాద్

LRS పేరిట భారీ పెనాల్టీలు రద్దు చేయాలని CPM ధర్నా

#CPMAmberpet

కరోనా కష్టకాలంలో TRS ప్రభుత్వం LRS పేరుతో పేద మధ్య తరగతి పై భారీ పెనాల్టీలు భారం మోపడాన్నీ వ్యతిరేకిస్తూ CPM అంబర్ పేట్ కమిటీ ధర్నా జరిపింది.

రియల్ ఎస్టేట్ వ్యాపారులకు పెంచి పోషిస్తూ వారి లాభాలు పెంచుతున్న ప్రభుత్వం ప్లాట్ల కొనుగోలు దారులైన పేదలు చిన్న మధ్యతరగతి, విశ్రాంతి ఉద్యోగుల నుండి భారీ  పెనాల్టీల ద్వారా ఖజానా నింపుకోజుస్తుందని సీపీఎం పార్టీ  అంబర్ పేట్ కన్వీనర్ మహేందర్ విమర్శించారు.

నామ మాత్ర రేట్లతో రిజిస్ట్రేషన్స్ రెగ్యులరైజేషన్స్ చేయాలని డిమాండ్ చేశారు. భూమి రికార్డులన్నీ రెవెన్యూ శాఖ నుండి గుంజుకున్న ప్రభుత్వం భవిష్యత్ లో పెట్టుబడి దారుల సెజ్ లకు అక్రమంగా భూకేటాయింపులు చేయాలనే కుట్ర చేస్తుందన్నారు.

ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే నిజంగా అక్రమ వెంచర్లు చేసి అమ్ముకుంటున్న రియల్ భూదండాను అడ్డుకోవాలని కబ్జాదారుల్ని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. DL మోహన్. d. రాములు, సుధాకర్ మల్లికార్జున్, సత్తిపండు, గిరి, ధనియాల్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

ఇంటెలిజెన్స్ చీఫ్ గా పి వి సునీల్ కుమార్?

Satyam NEWS

మంటలు రేపుతున్న బూతు మాటలు

Satyam NEWS

కోట్లలో వ్యాపారం: ప్రభుత్వ ఆదాయానికి గండి: వినియోగదారుల లూటీ

Satyam NEWS

Leave a Comment