30.7 C
Hyderabad
April 29, 2024 05: 01 AM
Slider ముఖ్యంశాలు

కోట్లలో వ్యాపారం: ప్రభుత్వ ఆదాయానికి గండి: వినియోగదారుల లూటీ

#kalwakurthy

నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణంలో కోట్లలో వ్యాపారం చేస్తూ అటు ప్రభుత్వ ఆదాయానికి గండి పెడుతూ, ఇటు వినియోగదారుడిని లూటీ చేస్తున్నారు. కల్వకుర్తి పట్టణంలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ పెయింట్స్ మొదలగు సామాగ్రి విక్రయించే వ్యాపారులు అన్ని డూప్లికేట్ వస్తువులను వినియోగదారులకు అంటగడుతూ కోట్లు దండుకుంటున్నారు. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ పెయింట్స్ మొదలగు వస్తువులలో ఉత్తమ కంపెనీలు సైతం ఎమ్ ఆర్ పీ కి 40 శాతం పైనే లాభం ఉంటుంది.

అయినా  లాభాలు సరిపోక డూప్లికేట్ వస్తువులను విక్రయిస్తూ వినియోగదారుని నిండా ముంచుతున్నారు. వినియోగదారునికి రెండు  వందల రూపాయలు కొనుగోలు చేసిన గూడ్స్ సర్వీస్ టాక్స్ నెంబర్ గల ఒరిజినల్ రసీదును ఇవ్వాలి కానీ  లక్షలు కొన్న బిల్స్ మాత్రం ఇవ్వటం లేదు. గూడ్స్ సర్వీస్ టాక్స్ నిబంధన ప్రకారం 49999 రూపాయలకు మించి కొనుగోలు చేసిన వినియోగదారుని పేరుమీద ఆన్ లైన్ వే బిల్ తో పాటు బిల్లును సైతం ఇవ్వాలి.

కాగా టన్నులకు టన్నులు ఇనుము, సిమెంట్ విక్రయిస్తున్నా ఏ ఒక్క వాహనానికి వే బిల్ ఇచ్చిన దాఖలాలు లేవు.ఈ వ్యాపారులు నెంబర్ ప్లేట్ లేని వాహనాలను నాన్ ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ ప్యాసింజర్ ఆటోలు వ్యవసాయానికి ఉపయోగించే ట్రాక్టర్లు మోటార్ కార్లు మొదలగు వాహనాలలో బిల్లులు వే బిల్లులు లేకుండా అక్రమ రవాణా చేస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు.

సెక్షన్ (4) 41 మోటార్ వెహికల్ యాక్ట్ 1988 (59 /1988) ఎస్. ఓ 451(ఇ) తేదీ 19 జూన్ 1992 ప్రకారం నాన్ ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ లో వస్తువులను తరలించు రాదని చట్టం చెబుతోంది. పరిమితికి మించి వాహనాలలో ఓవర్ లోడ్ తో రోడ్డుపైకి రాకూడదు. సెక్షన్ 114 మోటార్ వెహికల్ యాక్ట్ 1988  అతిక్రమించిన వారికి, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ తేదీ 09.11.2005 వి.పి.నెం 136/2003  పెనాల్టీ తో పాటు కాంపౌండింగ్ రుసుమును కూడా చెల్లించాలి.

అంతేగాక చిన్నచిన్న వాహనాలలో పెద్ద పెద్ద చీకులు, పైపులు మొదలగు పెద్ద పెద్ద పొడవాటి సామాగ్రితో నేషనల్ హైవే 765, హైదరాబాద్, శ్రీశైలం , కోదాడ రాయచూరు 167 రోడ్లపైకి అక్రమంగా దూసుకొస్తు ప్రమాదాలకు కారణం అవుతున్నారు.

ఇప్పటికైనా సంబంధిత అధికారులు చొరవ చూపి అటు ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతూ డూప్లికేట్ వస్తువులు, వేబిల్స్ , బిల్స్ వినియోగదారునికి ఇవ్వకుండా  అక్రమంగా రవాణా చేస్తున్న వ్యాపారస్తుల పై చర్యలు తీసుకోవాలని అదేవిధంగా ప్రమాదాలకు కారణమవుతున్న వాహనాలపై నిబంధనల ప్రకారం చట్టపరంగా పెనాల్టీలు కాంపౌండింగ్ పీజ్ వసూలు చేయాలని పట్టణ వాసులు కోరుతున్నారు.

పోలా శ్రీధర్, సత్యంన్యూస్.నెట్, కల్వకుర్తి

Related posts

“హిందూ” అనేది మతం కాదు…సనాతన భారతదేశ వైదిక వ్యవస్థ…!

Satyam NEWS

34 మంది సిబ్బందికి ప్రశంసా పత్రాలిచ్చిన పోలీస్ బాస్…!

Satyam NEWS

కరోనా కాటు ఒకవైపు నిత్యావసరాలు ధరల పెరుగుదల మరోవైపు

Satyam NEWS

Leave a Comment