40.2 C
Hyderabad
April 28, 2024 15: 48 PM
Slider నల్గొండ

ఏ పార్టీ అయినా ఎస్సీ వర్గీకరణకు మద్దతుగా వస్తే ఖబర్దార్

#SC

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో మాల మహానాడు సంఘం తరఫున ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తూ శుక్రవారం గోవిందపురం లోని అంబేద్కర్ కళా వేదికలో మాలల ముఖ్య సమావేశం హుజూర్ నగర్ పట్టణ మాల మహానాడు అధ్యక్షుడు దగ్గుపాటి బాబురావు అధ్యక్షతన జరిగింది.

ఈ సమావేశంలో ముఖ్య అతిథులుగా పి.వి.రావు మాల మహానాడు జాతీయ ఉపాధ్యక్షుడు పోతుల జ్ఞానయ్య,జిల్లా ప్రధాన కార్యదర్శి గొట్టి ముక్కుల రాములు,నియోజకవర్గ ఉపాధ్యక్షుడు పాలడుగు వెంకటేశ్వర్లు హాజరై డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి,పి.వి.రావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా మాల మహానాడు పట్టణ అధ్యక్షుడు దగ్గుబాటి బాబురావు మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ వద్దు.ఐక్యతే ముద్దు అని ఉమ్మడి రిజర్వేషన్లు దళితుల ఐక్యతను కోరుతూ   అహర్నిశలు పోరాడి అసువులు బాసిన పి.వి రావు కృషి వలన అప్పటి ప్రభుత్వం మాలల పరాక్రమము ముందు ఓడిపోయి భారతదేశ అత్యున్నత న్యాస్థాన మైన సుప్రీంకోర్టు ఎస్సీ లను వర్గీకరించుట చెల్లదని తీర్పు వెలువరించి 20 సంవత్సరాలు గడిచినా కూడా కొన్ని రాజకీయ పార్టీలు సోదరులుగా ఉన్న ఎస్సీ మాల,మాదిగలను వర్గీకరిస్తామని బూటక వాగ్దానాలతో కొన్ని రాజకీయ పార్టీలు మాల,మాదిగలను మోసం చేస్తూనే ఉన్నారని,అనేక లక్షల మంది ఉన్న మాలలు ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందని,ఎస్సీ రిజర్వేషన్ శాతం పెంచకుండా వర్గీకరణ సాధ్యం కాదని సుప్రీంకోర్టు సుస్పష్టమైన తీర్పు ఇచ్చిందని, పలుమార్లు జాతీయ ఎస్సీ కమిషన్ ఇది సాధ్యపడదని భారత పార్లమెంట్ కు  నివేదించినా కాలం చెల్లిన వర్గీకరణను కొన్ని రాజకీయ పార్టీలు నెత్తిన పెట్టుకొని మోయాల్సినంత పని లేదని అన్నారు.ఎస్సీ వర్గీకరణ జోలికి వస్తే అన్ని పార్టీలకు ఖబర్దార్ అని,సంగతి చూస్తామని ఈ సందర్భంగా బాబురావు అన్నారు.

ఈ కార్యక్రమంలో మాల మహానాడు రాష్ట్ర,జిల్లా,నియోజకవర్గ,పట్టణ నాయకులు జెట్టి ప్రసాద్,దాసరి పున్నయ్య,  పాశం నరసింహారావు,పాలడుగు రాజు, బాప్పని రాజు,బండి భాస్కర్,పోతుల రాజు, తుమ్మకొమ్మ అరుణ్ కుమార్,తులసి రావు,గణేష్,కార్తీక్,తిరుపమ్మ,కల్పన, మంగమ్మ,రాణి,యువత,మహిళలు తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్ ప్రతినిధి, హుజూర్ నగర్

Related posts

గ్రామ సభల నిర్వహణపై ప్రభుత్వం సీరియస్ గా ఉండాలి

Satyam NEWS

ధాన్యం కొనరు కానీ ఎం‌ఎల్‌ఏ లను కొంటారట

Murali Krishna

టెక్వీస్సేన్ సాఫ్ట్వేర్ ప్రారంభించిన మంత్రి అవంతి

Satyam NEWS

Leave a Comment