29.7 C
Hyderabad
May 6, 2024 05: 44 AM
Slider ఖమ్మం

విధ్యార్ధులకు సిపిఆర్ మీద అవగాహన

#sriraksha

ఖమ్మం  గుట్టలబజార్ నందు శ్రీ రామకృష్ణ విద్యాలయం లో పాఠశాల విధ్యార్ధులకు సి. పి. ఆర్. చేసే విధానం పై అవగాహనా కార్యక్రమం నెహ్రూ నగర్ లోని శ్రీ రక్ష హాస్పిటల్స్ ఆద్వర్యంలో జరిగినది . ప్రస్తుత పరిస్తితుల్లో హఠాత్తుగా గుడెనొప్పి వచ్చి వయసు తో సంబంధం లేకుండా కుప్ప కూలిపోతున్నారు . అటువంటి సమయంలో ఆంబ్యులెన్స్ వచ్చే లోపు ఏమి చేయాలి అనే అవగాహన ఎంతో ముఖ్యం కాబట్టి పాఠశాల విధ్యార్ధులకు మరియు పాఠశాల సిబ్బందికి అవగాహన కల్పించటం జరిగినది అని పాఠశాల అధ్యక్షులు డాక్టర్ గోంగూర వెంకటేశ్వర్లు తెలిపారు . పాఠశాల ప్రధానాచార్య సంతోష గౌతం మాట్లాడుతూ డాక్టర్ మానస మరియు సిస్టర్ వనజ సి.పి.ఆర్. గురించి అలాగే బి.ఎల్.ఎస్. బేసిక్ లైఫ్ సపోర్ట్ గురించి చాలా చక్కగా పిల్లలకు మరియు టీచర్స కి వివరించి వాళ్ళతో కూడా ప్రదర్శింప చేశారు . శ్రీ రక్ష హాస్పిటల్స్ వారికి ధన్యవాదమ్ములు తెలిపారు . ఈ కార్యక్రమంలో పాఠశాల అధ్యక్షులు డాక్టర్ గోంగూర వెంకటేశ్వర్లు , పాఠశాల కార్యదర్శి ఎన్. శ్రీనివాస్ , పాఠశాల ప్రధానాచార్య సంతోష గౌతం , పాఠశాల అధ్యాపక అధ్యపకేతర సిబ్బంది విధ్యార్ధులు పాల్గొన్నారు .

Related posts

బిజెపి నుంచి పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు నిధులు?

Satyam NEWS

యువగళం పై హత్యాయత్నం కేసులు పెట్టిన పోలీసులు

Bhavani

కాగజ్ నగర్ లో ఉచిత రక్తహీనత శిబిరానికి విశేష స్పందన

Satyam NEWS

Leave a Comment