40.2 C
Hyderabad
May 2, 2024 17: 51 PM
Slider ఖమ్మం

రేషన్ షాపులు ఆకస్మిక తనిఖి

#collector

ఖమ్మం జిల్లా రఘునాధపాలెం మండలం వివి. పాలెం, కొణిజేర్ల మండలం తణికెళ్ల లోని రేషన్ షాపులను జిల్లా కలెక్టర్‌ వి.పి. గౌతమ్‌  ఆకస్మిక తనిఖి చేశారు.  ఈ సందర్భంగా కలెక్టర్‌ రేషన్ షాపుల్లో నిల్వలు, పంపిణీ, ప్రారంభ నిల్వల వివరాలను పరిశీలించారు.  రేషన్‌ కొరకు వచ్చిన వినియోగదారులతో మాట్లాడుతూ, సమయానికి రేషన్‌ అందుతున్నది లేనిది, తూకం సక్రమంగా ఉంటున్నది, లేనిది వివరాలను అడిగి తెలుసుకున్నారు.  పంపిణీ ప్రక్రియలో ఏమైన సమస్యలు ఉన్నాయా అని తెలుసుకున్నారు.  నిల్వ వివరాలు, అందించే రేషన్‌, ఉచితంగా అందిస్తున్నది పట్టికలో పొందుపర్చి, వినియోగదారులకు కన్పించేలా స్పష్టంగా వివరాలు బోర్డులో ప్రదర్శించాలని కలెక్టర్‌ చౌక దుకాణాల డీలర్లను ఆదేశించారు.  రేషన్‌ పంపిణీలో పారదర్శకంగా  ఉండేందుకు గాను లబ్ధిదారుడు స్వయంగా వచ్చి రేషన్‌ తీసుకునే విధానం ద్వారా పంపిణీ ప్రక్రియ జరుగుతుందని ఆయన తెలిపారు. రేషన్ ఇస్తున్న తీరును కలెక్టర్ పరిశీలించారు.

Related posts

అనుమానాస్పద పరిస్థితుల్లో వివాహిత మృతి

Satyam NEWS

అవినీతి ఫైళ్లను పాతరేస్తున్న పాత అధికారులు

Satyam NEWS

వేడుకగా హత్యరాల శ్రీ కామాక్షి సమేత త్రేతేశ్వర స్వామి కళ్యాణం

Satyam NEWS

Leave a Comment