38.2 C
Hyderabad
May 3, 2024 19: 10 PM
Slider హైదరాబాద్

సుప్రీంలో పిటీషన్ దాఖలు చేసిన తెలంగాణ క్రాకర్స్ అసోసియేషన్

crackers association

దీపావళి పండుగ సందర్భంగా క్రాకర్స్ ను బ్యాన్ చేస్తూ హైకోర్టు తీర్పు పై స్టే ఇవ్వాలని తెలంగాణ క్రాకర్స్ అసోసియేషన్ సుప్రీంకోర్టును ఆశ్ర‌యించింది.

ఇప్పటికే షాపులలో స్టాకును తెచ్చుకున్నామ‌ని, పండుగ రెండు రోజుల ముందు బ్యాన్ విధిస్తే తాము కోట్లల్లో నష్టపోతామని తెలంగాణ క్రాకర్స్ అసోసియేషన్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖ‌లు చేసింది.

తెలంగాణ ప్రభుత్వం విధించిన బ్యాన్ను ఎత్తివేయాలని సుప్రీంకోర్టు కోర్టు పిటీషనర్ కోరారు. హైకోర్టు తీర్పు వల్ల ఆర్థికంగా చాలా న‌ష్ట‌పోతామ‌ని త‌ద్ఫ‌లితంగా ఆత్మహత్య లు చేసుకునే ప‌రిస్థితులు త‌లెత్త‌వ‌చ్చ‌ని పిటిషన‌ర్ పేర్కొన్నారు. అన్నిఅనుమతులు ప్రభుత్వం ఇచ్చి ఇప్పుడు బ్యాన్ అంటే తాము ఏం చేయాల‌ని ప్ర‌శ్నించారు.

అలాంటిది ఒక నెల ముందైనా క‌నీసం బ్యాన్ విధించే అంశాన్ని తెలియ‌జేస్తే తాము ఇంత పెద్ద‌మొత్తంలో ట‌పాసుల‌ను తెచ్చుకునేవార‌మే కాద‌ని ఇప్ప‌టిక‌ప్పుడు బ్యాన్ చేస్తే తాము తీవ్రంగా న‌ష్ట‌పోవ‌డ‌మే కాకుండా త‌మ కుటుంబాలు ఆసాంతం రోడ్డుమీద ప‌డే ప‌రిస్తితులు త‌లెత్తుతాయ‌ని పేర్కొన్నారు.

కాగా ఈ పిటీషన్ పై నేడు సుప్రీంకోర్టు విచార‌ణ చేప‌ట్ట‌నుంది.

Related posts

అయోధ్య తీర్పు నేపథ్యంలో సోషల్ మీడియాపై నిఘా

Satyam NEWS

హాస్టల్ విద్యార్ధులకు కంటి వైరస్ కలకలం

Satyam NEWS

స్లో రికవరీ:చైనాలో రోజు రోజుకు తగ్గుతున్న కరోనా

Satyam NEWS

Leave a Comment