38.2 C
Hyderabad
April 29, 2024 19: 14 PM
Slider మహబూబ్ నగర్

నేరస్తులకు శిక్ష వేయించడంతో నాగర్ కర్నూల్ టాప్

nagarkurnool

లాంగ్ పెండింగ్ కేసులపై నాగర్ కర్నూల్ జిల్లా ఎస్పి డాక్టర్ వై. సాయి శేఖర్ నేడు సమీక్షా సమావేశం నిర్వహించారు. 2019 సంవత్సరంలో శిక్ష పడే కేసుల శాతం పెంచినందుకు కోర్టు డ్యూటీ ఆఫీసర్ లను ఆయన ఈ సందర్భంగా అభినందించారు.

సెషన్స్ కోర్టు పరిధిలో ట్రయల్ నడిచే పోక్సో, రేప్, మర్డర్, తదితర కేసులను టార్గెట్ గా  పెట్టుకుని నేరస్తులకు శిక్షలు పడే విధంగా సాక్షులను మోటివేట్ చేయాలని సూచించారు. నాన్ బెయిలబుల్ వారెంట్ విషయంలో సుప్రీం కోర్ట్ హై పవర్ కమిటీ రివ్యూ చేస్తున్నందున పెండింగ్ ఉన్న నాన్ బెయిలబుల్ వారెంట్ లను తక్షణమే అమలు చేయాలని సూచించారు.

కోర్టులో పెండింగ్ లో ఉన్న నాన్ బెయిలబుల్ వారెంట్స్, కోర్టు డ్యూటీ ఆఫీసర్ల వద్ద పెండింగ్ ఉన్న జాబితాలో ఎలాంటి తేడాలు ఉండవద్దని తెలిపారు. 1973 సంవత్సరం నాటి నుంచి ఉన్న  కేసులు, ఇతర లాంగ్ పెండింగ్  కేసుల సిడి ఫైల్స్ చదివి ఏ విధంగా డిస్పోజల్ చేయాలో సంబంధిత అధికారులతో మాట్లాడాలని ఆయన సూచించారు. డిస్పోజల్ కు  ప్రపోజల్స్ పంపించాలని ఆయన ఆదేశించారు.

లాంగ్ పెండింగ్ కేసులలో సంబంధిత పబ్లిక్ ప్రాసిక్యూటర్,  అడిషనల్  పబ్లిక్ ప్రాసిక్యూటర్, అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ల, సంబంధిత అధికారుల అభిప్రాయం తీసుకోవాలని కోరారు. నేరస్తులు, సాక్షులు ఇతర ప్రాంతాలలో  ఉంటే వారిపై ఉన్న నాన్ బెయిలబుల్ వారెంట్ పెండింగ్ ఉంటే , ఓటర్ ఐ.డి  వంటి ఇతర ఆధారాలతో ఎంక్వయిరీ చేసి, సంబంధిత డిపార్ట్మెంట్ వారికి ప్రపోజల్స్ పంపించాలని ఆదేశించారు.

ప్రతి రోజూ క్రమం తప్పకుండా కోర్టుకు వెళ్లాలని, క్రిమినల్ జస్టిస్ సిస్టం సిసిటిఎన్ఎస్/కోర్టు మానిటరింగ్ సిస్టం లో కోర్టులో జరిగే ప్రాసెస్ సిసిడిలు  సమన్స్ వారెంట్స్ అధునాతన టాప్స్ వినియోగించి, ప్రతి రోజూ క్రమం తప్పకుండా ఎంట్రీ చేయాలని సూచించారు. క్రిమినల్ జస్టిస్ సిస్టం ద్వారా ఎంట్రీ చేసిన డాటా  దేశంలో ఎక్కడైనా ఏ అధికారి అయినా చూసుకునే అవకాశం ఉంటుందని, నేర నిరూపణ రేటు మరింత పెంచాలని ఆయన అన్నారు.

ఈ సమావేశంలో మహబూబ్ నగర్ జిల్లా పబ్లిక్ ప్రాసిక్యూటర్ బాల గంగాధర్ రెడ్డి, నాగర్ కర్నూల్ (ఇంచార్జి అచ్చంపేట) JFCM  పబ్లిక్ ప్రాసిక్యూటర్  రఘునాథ్ రెడ్డి, నాగర్ కర్నూలు స్పెషల్ మొబైల్ కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ రూపా రెడ్డి,   కల్వకుర్తి JFCM పబ్లిక్ ప్రాసిక్యూటర్ సరిత రాణి, కొల్లాపూర్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ మనోహర్, మహబూబ్నగర్ ఎస్సీ ఎస్టీ కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ రఘుపతి పాల్గొన్నారు.

ఇంకా ఈ సమావేశంలో నాగర్ కర్నూల్ జిల్లా లోని డీఎస్పీలు  మోహన్ రెడ్డి, నరసింహులు,  గిరిబాబు,  సిఐలు నాగరాజు, రామకృష్ణ, సైదులు,  బీసన్న,  గాంధీ నాయక్, వెంకట్ రెడ్డి, డి సి ఆర్ బీ ఇన్స్పెక్టర్ రామ్ లాల్,  పోలీస్ కంట్రోల్ రూమ్ ఇన్స్పెక్టర్ వినాయక రెడ్డి, కోర్టు లైజనింగ్ అధికారులు అసిస్టెంట్ సబ్- ఇన్స్పెక్టర్  కృష్ణయ్య, జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్ లలో పనిచేసే  కోర్ట్ కానిస్టేబుల్ సిబ్బంది పాల్గొన్నారు.

Related posts

12న రణస్థలానికి యువత తరలిరావాలి

Satyam NEWS

నా భూమి ఆక్రమిస్తున్నారు అధికారులూ కాపాడండి

Satyam NEWS

మెటర్నిటీ హెల్త్ అవార్డు గ్రహీతలకు అభినందన

Bhavani

Leave a Comment