26.7 C
Hyderabad
May 3, 2024 09: 03 AM
Slider మెదక్

నేరస్తులకు శిక్ష పడేలా పోలీసు దర్యాప్తు ఉండాలి

మెదక్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో జిల్లా యెస్.పి రోహిణి ప్రియదర్శిని మెదక్ సబ్ డివిజన్ సిబ్బందితో నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా యెస్.పి మాట్లాడుతూ వేసవి సెలవులు, శుభకార్యాల సందడి దృష్ట్యా దొంగతనాలు, నేరాలు జరుగకుండా ప్రజలు తీసుకోవలసిన జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తూ ప్రచారం చేయాలని సిబ్బందిని ఆదేశించారు.

ఏదైనా నేరం జరిగిన తర్వాత క్లుస్ టీమ్ ప్రాముఖ్యత ను తెలియజేస్తూ నిందితుల పూర్తి వివరాలు నమోదు చేయాలని అవి కేసు పురోగతికి ఎంతో ఉపయోగపడతాయని అన్నారు. అలాగే కేసులు పెండింగ్ లో ఉండుటకు గల ముఖ్య కారణాలను తెలుసుకొని ప్రస్తుతము ఆ కేసుల పరిస్థితులను చాలా కాలము నుండి పెండింగ్ లో ఉన్నటువంటి కేసులను సంబంధిత అధికారులు పూర్తి చేయాలని ఆదేశించారు.

పెండింగ్ ఉన్న (అండర్ ఇన్వెస్టిగేషన్) కేసులలో గ్రేవ్, నాన్ గ్రేవ్ కేసులకు సంబంధించిన డాక్యుమెంట్స్ ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్స్, మెడికల్ సర్టిఫికెట్ త్వరగా తెప్పించి ప్రతిరోజు కేసులను టార్గెట్గా పెట్టుకుని ప్రతి పోలీస్ స్టేషన్లలో (యు.ఐ) కేసులు తగ్గించడానికి ప్రతి అధికారి ఛాలెంజ్ గా తీసుకొని కేసులు చేదించాలని సూచించారు.

అదే విధంగా మహిళాలు, పిల్లల రక్షణ విషయములో ప్రత్యేక దృష్టి సారించాలని, పోలీస్ అధికారులు మహిళా రక్షణకు అన్ని చర్యలు చేపట్టాలని తెలిపారు, పోక్సో కేసులలో, ఎస్.సి., ఎస్.టి. కేసులల్లో పూర్తి సాక్ష్యాలతో దర్యాప్తు చేసి నేరస్తులకు శిక్షలు పడేవిధంగా చూడాలని, చట్టము పై సమాజములో అవగాహన కల్పించాలని, ప్రతి యూనిట్ అధికారులు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటూ, ప్రత్యేక ప్రణాళికతో పెండింగ్ కేసులను తగ్గించాలని ఆదేశించారు.

బ్ల్యూ కొల్ట్స్, పాట్రో మొబైల్ అనుక్షణం ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆపదలో ఉన్న వారిని ఆదుకోవటం చాలా ముఖ్యం అని అన్నారు. రిసెప్షన్, ఎస్.హెచ్.ఒ, కమ్యూనిటి పోలిసింగ్ ఇలా పోలీసు స్టేషన్ కి సంబందించిన అన్ని విభాగాల ఫంక్షనల్ వర్టికల్స్ గురించి వారి పనితీరు గురించి అడిగి తెలుసుకొని స్టేషన్లోని వివిధ వర్టికల్స్ లో సిబ్బంది పోటీతత్వం తో పనిచేసి మెరుగైన అభివృద్ధి సాధించాలని తెలిపారు.

అలాగే కమ్యూనిటీ పోలిసింగ్ లో భాగంగా సిసి కెమెరాల ఏర్పాటు వేగవంతం చేయాలని ఆదేశించారు. తద్వారా నేర నియంత్రణ చేయవచ్చని అన్నారు. నేర విచారణ అధికారి కేసులలో శిక్షలు పడే విధంగా ఇన్వెస్టిగేషన్ చేయాలని, కోర్టులో ట్రయిల్ నడిచే సమయంలో పోలీస్ అధికారులు సాక్షులను మోటివేట్ చేయాలని సూచించారు. అలాగే సమన్స్, వారంట్స్ ఎగ్సిక్యూటివ్ చేయాలని, క్రైమ్ అగైనెస్ట్ ఉమెన్ కేసుల్లో త్వరగా ఇన్వెస్టిగేషన్ పూర్తి చేసి కోర్టులో చార్జిషీట్ దాఖలు చేయాలని కోరారు.

పోలీస్ అధికారులు సాక్షులను మోటివేట్ చేసి నిందితులకు శిక్షలు పడే విధంగా మానిటర్ చేయాలని సూచించారు. పోలీస్ స్టేషన్ కి వచ్చే ప్రతి దరఖాస్తును ప్రాపర్ గా ఎంక్వైరీ చేసి, ఎంక్వైరీ రిపోర్టును ఆన్లైన్లో అప్లోడ్ చేయాలని సూచించారు. ప్రతి దరఖాస్తులో పారదర్శకంగా ఎంక్వైరీ చేసి అట్టి రిపోర్టును CCTNS ఆన్లైన్లో అప్లోడ్ చేయాలని సూచించారు.

పెండింగ్ కేసులను త్వరగా పరిష్కరిస్తూ పెండింగ్ కేసుల సంఖ్య తగ్గించడానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పెండింగ్ కేసుల విషయంలో నిరంతర పర్యవేక్షణ ఉంటుందని, అలాగే విది నిర్వహణలో ఉత్తమ పనితీరు కనపరిచిన సిబ్బందిని అభింనందించారు.

ఇలాగే పని చేస్తూ జిల్లాకు, తెలంగాణ రాష్ట్ర పోలీస్ వ్యవస్థకు మంచి పేరు తేవాలని అన్నారు. ఈ సమావేశంలో మెదక్ డి.ఎస్.పి.సైదులు, డి.సి.ఆర్.బి. డి.ఎస్.పి.నారాయణ రెడ్డి, డి.సి.ఆర్.బి. సి.ఐ.సునిల్, మెదక్ సబ్ డివిజన్ సి.ఐ.లు, యెస్.ఐ లు మరియు సిబ్బంది పాల్గొన్నారు.

Related posts

సోనియాగాంధీ తో వీడియో కాల్ లో మాట్లాడిన కోమటిరెడ్డి

Satyam NEWS

సీఎం కేసీఆర్ మనసు మార్చు తల్లీ

Satyam NEWS

లోకకళ్యాణార్ధం హత్యరాలలో వనదుర్గ మహావిద్య హోమం,యాగం

Satyam NEWS

Leave a Comment