40.2 C
Hyderabad
May 2, 2024 17: 57 PM
Slider హైదరాబాద్

ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఏ.ఎస్.రావు నగర్ సొసైటీ

#crockershops

ప్రజల సంక్షేమం గురించి,  పట్టించుకోకుండా డబ్బే ముఖ్యంగా బాణాసంచా షాపులకు అనుమతిచ్చి బాధ్యతారహితంగా ఏ.ఎస్.రావు నగర్ సొసైటీ వ్యవహరిస్తున్నదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాప్రా సర్కిల్ పరిధిలోని ఏ.ఎస్.రావు నగర్ సొసైటీ మైదానంలో బాణాసంచా (ఫైర్ క్రాకర్స్) షాపులు విచ్చలవిడిగా వెలిశాయి. ఎలాంటి నిబంధనలు పాటించకుండా పదులకొద్దీ భారీ ఫైర్ షాపులను ఫైర్ క్రాకర్స్ వ్యాపారులు ఏర్పాటు చేశారు.

షాపుకు షాపుకు మధ్యలో ఖాళీ స్థలం వదలకుండా, జాగ్రత్తలు పాటించకుండా జనావాసాల మధ్య ఫైర్ షాపులు ఏర్పాటు చేయడం పై విమర్శలు వినిపిస్తున్నాయి. ఫైర్ క్రాకర్స్ కొనేందుకు భారీగా పోగవుతున్న ప్రజలతో అక్కడ రద్దీ ఏర్పడుతున్నది. ప్రజలు, వ్యాపారుల వాహనాలతో మైదానం కిక్కిరిసిపోతున్నది. ఫైర్ షాపుల ముందు తీసుకోవాల్సిన కనీస అత్యవసర జాగ్రత్తలు అంతంత మాత్రమే… నిజానికి శూన్యమని చెప్పాలి. కిక్కిరిసిన ప్రజల మధ్య అనుకోకుండా ఏదైనా అగ్ని ప్రమాదం జరిగితే, ప్రజల ఉరుకులు, పరుగులు, వాహనాల మధ్య తొక్కిసలాట జరిగి ప్రాణ, ఆస్తి నష్టం జరిగితే ఎవరిది భాధ్యత… ఇవేవీ పట్టించుకోకుండా మున్సిపల్ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు.

అటువైపు కన్నెత్తి చూడని చర్లపల్లి ఫైర్ స్టేషన్ సిబ్బంది తో మరింత ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. ఇప్పటికే తమిళనాడు సహా పలు ప్రాతాల్లోని బాణాసంచా తయారీ ఫ్యాక్టరీలు, పలు షాపులలో అగ్ని ప్రమాదాలు సంభవించి ప్రాణ, ఆస్థి నష్టం జరిగిన సంఘటనలు అనేకం ఉన్నయి. ఇప్పటికైనా ఉప్పల్ ఎమ్మెల్యే, స్థానిక కార్పొరేటర్, మున్సిపల్ మరియూ ఫైర్ స్టేషన్ అధికారులు, లా అండ్ ఆర్డర్, మరియూ ట్రాఫిక్ పోలీసులు వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. ప్రజల సంక్షేమం కోసం ఆలోచించకుండా అక్రమంగా ఏర్పాటు చేసిన ఫైర్ షాపులు, వాటికి అనుమతులు ఇచ్చిన సొసైటీ వారిపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

Related posts

సి‌పి‌ఆర్ పై అవగాహన వుండాలి

Murali Krishna

ట్యాగ్ యింగ్ జరగక పీ ఆర్ సిబ్బందికి ఇబ్బంది

Bhavani

ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఖమ్మం జిల్లా హోంగార్డుల థాంక్స్

Satyam NEWS

Leave a Comment