40.2 C
Hyderabad
May 2, 2024 18: 11 PM
Slider నల్గొండ

పంట మార్పిడి విధానాన్ని రైతులు అలవాటు చేసుకోవాలి

#sidireddy

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గం గరిడేపల్లి మండలం గడ్డిపల్లి కృషి విజ్ఞాన కేంద్రం నందు శాస్త్రీయ పద్ధతిలో తేనెటీగల పెంపకంపై నైపుణ్య శిక్షణ ముగింపు కార్యక్రమానికి హాజరై హుజూర్ నగర్ శాసనసభ్యుడు శానంపూడి సైదిరెడ్డి సర్టిఫికెట్లు అందజేశారు.

ఈ సందర్భంగా శానంపూడి సైదిరెడ్డి మాట్లాడుతూ గడ్డిపల్లి లోని కృషి విజ్ఞాన కేంద్రం ఏర్పాటు చేసి వ్యవసాయ రంగంపై ప్రతి ఒక్కరు మక్కువ చూపేలా గోపాల్ రెడ్డి ఎంతో కృషి చేశారని,వారి కృషిని ఎంత పొగిడినా తక్కువే అవుతుందని అన్నారు.నేడు తేనెటీగల పెంపకంపై ప్రొఫెసర్ల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు ఏర్పాటు చేసి కోర్సు పూర్తయిన వారికి సర్టిఫికెట్లు అందించటం తనకు చాలా సంతోషకరంగా ఉందని అన్నారు.

యువత కూడా పంట మార్పిడి విధానాలపై అవగాహన కల్పించేలా ముందడుగు వేయాలని,ఒకే పంట వేయడం కాకుండా పంట మార్పిడి విధానం అలవాటు చేయడంలో కృషి విజ్ఞాన కేంద్రం బృందం ముందుందని అన్నారు.సిఎం కెసిఆర్ ఇచ్చిన పిలుపు మేరకు పంట మార్పిడి విధానాన్ని అవలంబించాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నానని అన్నారు.కృషి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో పట్టు పురుగులు, తేనె టిగల పెంపకంపై అవగాహన కల్పించడం హర్షణీయమని, హుజూర్ నగర్ నియోజకవర్గ ప్రజలకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు.

ఈ కార్యక్రమంలో హుజూర్ నగర్ మార్కెట్ చైర్మన్ కడియం వెంకట్ రెడ్డి, గరిడేపల్లి ఎంపిపి సుజాత శ్రీనివాస్ గౌడ్, మాజీ జెడ్పిటిసి శ్రీనివాస్ గౌడ్, ఎంపిటిసి స్రవంతి శోభన్,గ్రామ సర్పంచ్ నాగేశ్వరావు,మాజీ సర్పంచ్ మాశెట్టి శ్రీహరి,పలు గ్రామాల సర్పంచులు,ఎం పి టి సి లు,కార్యకర్తలు,గడ్డిపల్లి కృషి విజ్ఞాన కేంద్రం సీనియర్ శాస్త్రవేత్త లవకుమార్ డాక్టర్ రెడ్డి,సెక్రెటరీ, శాస్త్రవేత్తలు,ఫ్యాకల్టీలు తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్, హుజూర్ నగర్

Related posts

రేపు బడిగంట: పది నెలల తర్వాత తెరుచుకోనున్న పాఠశాలలు

Satyam NEWS

చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ తో మంత్రి కేటీఆర్ సమావేశం

Satyam NEWS

నేడు చదువుల తల్లి సావిత్రి బాయి ఫూలే జయంతి

Satyam NEWS

Leave a Comment