35.2 C
Hyderabad
May 9, 2024 16: 41 PM
Slider ఖమ్మం

గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు కోట్ల రూపాయలు ఖర్చు

#Minister Puvvada Ajay Kumar

నగరాభివృద్ధితో సమానంగా రఘునాథపాలెం మండలం ప్రతి గ్రామాల్లో మౌళిక వసతుల కల్పనకు నిధులు మంజూరు చేయించి గ్రామాలను అభివృద్ధి పరచడం జరిగిందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ పేర్కొన్నారు. రఘునాథపాలెం మండలంలో రూ.2.42 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులకు శంఖుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. చిమ్మపుడి గ్రామంలో రూ.1.10కోట్లు, కోటపాడు గ్రామంలో రూ.1.32కోట్లతో నిర్మించిన సీసీ రోడ్లు, డ్రైన్‌లను మంత్రి ప్రారంభించారు.

అనంతరం రఘునాధపాలెం మండలం గ్రామాల్లో జరిగిన అభివృద్దిపై రూపొందించిన ప్రగతి నివేదిక బ్రోచర్‌ను మంత్రి ఆవిష్కరించారు. చిమ్మపుడి గ్రామంలో ఎన్‌ఆర్‌ఈజిఎస్‌ నిధులు రూ.85లక్షలతో 16 సీసీ రోడ్లు, 3 సీసీ డ్రైన్‌ల నిర్మాణ పనులను మంత్రి ప్రారంభించారు. ఎస్‌డిఎఫ్‌ నిధులు రూ.10లక్షలతో నిర్మించిన మూడు సీసీ రోడ్ల నిర్మాణ పనులను ప్రారంభించారు. సిఎస్‌ఆర్‌ ట్రాన్స్‌కో నిధులు రూ.12 లక్షలతో రెండు డొంక రోడ్లను విస్తరించి అభివృద్ది చేసిన మట్టి రోడ్లను ప్రారంభించారు. సుడా నిధులు రూ.3.50 లక్షలతో ఎర్పాటు చేసిన హై-మాస్ట్‌ లైట్స్‌ ను ప్రారంభించారు.

కోటపాడు గ్రామంలో ఎస్‌డిఎఫ్‌ నిధులు రూ.10లక్షలతో నిర్మించిన రెండు సీసీ సైడ్‌ డ్రైన్లు, ఒక సీసీ రోడ్డును ప్రారంభించారు. సిఎస్‌ఆర్‌ ట్రాన్స్‌కో నిధులు రూ. 17లక్షలతో రెండు డొంక రోడ్లను మట్టి రోడ్లుగా విస్తరించి అభివృద్ది చేసిన రోడ్లను వారు ప్రారంభించారు. రూ.40 లక్షల (సిఎస్‌ఆర్‌ ట్రాన్స్‌కోనిధులతో నిర్మించనున్న బ్లాక్‌ బిటి రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. సుడా నిధులు రూ.3.50 లక్షలతో గ్రామ సెంటర్‌ లో ఎర్పాటు చేసిన హై మాస్ట్‌ లైట్స్‌ ను ప్రారంభించారు.

ఎన్‌ఆర్‌ఈజిఎస్‌ నిధులు రూ.62లక్షలతో నిర్మించిన 13-సీసీ రోడ్స్‌ లను వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి పువ్వాడ మాట్లాడుతూ మండలంలో ప్రతి పథకం ద్వారా నిధులు కుమ్మరించి అభివృద్ది చేసిన ఇప్పుడే మండలంలోని 22 గ్రామాలలో రోడ్ల కోసం ఎన్‌ఆర్‌ఈజిఎస్‌ నిధులు రూ.3 కోట్లు మంజూరుకు సంబందించి జిఓ వచ్చింది.

త్వరలో ఆయా నిధులు మండలంలోని ఆయా గ్రామాలకు కేటాయించి మరిన్ని రోడ్లు వేస్తామని స్పష్టం చేశారు. సుడా చైర్మన్‌ బచ్చు విజయ్‌ కుమార్‌, జడ్‌ పి.టీ సి.ప్రియాంక, ఎం పి పి.గౌరీ, ఇ ఇ అర్‌ అండ్‌ బి శ్యాంప్రసాద్‌, విశ్వనాధ్‌, తహసీల్దార్‌ విల్సన్‌, ఎం పి డి ఓ. రామకృష్ణ, వీరునాయక్‌, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

Related posts

మహోన్నత వ్యక్తి, నటుడు చిత్తూరు నాగయ్య

Satyam NEWS

దేవునిపల్లిలో కరోనా లక్షణాలతో భారమంతా దేవుడి మీదే

Satyam NEWS

ధాన్యం సేకరణ పూర్తి చేయాలి

Satyam NEWS

Leave a Comment