38.2 C
Hyderabad
May 2, 2024 22: 50 PM
Slider జాతీయం

నిషేధం కాదు నియంత్రణ .. క్రిప్టోకరెన్సీపై పార్లమెంట్ కమిటీ

భారత్‌లో క్రిప్టోకరెన్సీల భవిష్యత్తుపై ఆర్థిక శాఖ మాజీ సహాయ మంత్రి జయంత్ సిన్హా నేతృత్వంలోని పార్లమెంటరీ కమిటీ సమావేశం అయ్యింది. ఎక్స్ఛేంజీలు, బ్లాక్ చైన్, క్రిప్టో అసెట్స్ కౌన్సిల్ (BACC), పరిశ్రమ సంస్థలు, ఇతర వాటాదారులతో ఈ సమావేశాన్ని నిర్వహించింది కమిటీ.

క్రిప్టోకరెన్సీపై పెట్టుబడులను ఆపలేమని.. అయితే దానిని ఖచ్చితంగా నియంత్రించవచ్చని మాత్రం కమిటీ సభ్యులు అంగీకరించినట్లు తెలుస్తోంది. క్రిప్టోకరెన్సీని పూర్తిగా నిషేధించడానికి చాలా మంది కమిటీ సభ్యులు అనుకూలంగా లేరని సమాచారం. సభ్యులు క్రిప్టో కరెన్సీ మార్పిడి, నియంత్రణకు అనుకూలంగా ఉన్నారని.. తద్వారా క్రిప్టో దుర్వినియోగం చేయబడకుండా చూడాలని కోరినట్లుగా తెలుస్తోంది. క్రిప్టోకరెన్సీలలో పెట్టుబడిదారుల డబ్బు భద్రతపై సభ్యులు నొక్కిచెప్పారు.

Related posts

యువగళం పై హత్యాయత్నం కేసులు పెట్టిన పోలీసులు

Bhavani

హై ఎలర్ట్: హైదరాబాద్ లో మరో మూడు పాజిటీవ్ కేసులు

Satyam NEWS

ఏపీ పోలీసులు అదుపులో తెలంగాణ వాసి…!

Satyam NEWS

Leave a Comment