38.2 C
Hyderabad
April 29, 2024 14: 49 PM
Slider జాతీయం

ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి రాజీనామా చేయాలి

#kapaul

ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటేరెస్ తక్షణమే రాజీనామా చెయ్యాలని ప్రముఖ క్రైస్తవ మత ప్రచారకుడు కె.ఏ.పాల్ డిమాండ్ చేశారు. నిజంగా యుద్ధం జరగడం లేదని అది కేవలం వదంతి మాత్రమేనని ఆయన చెప్పడం తీవ్ర శోచనీయమని పాల్ చెప్పారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ అతనికి ఎంత ముడుపులు ముట్టజెప్పాడు? మద్యం మత్తులో ఆంటోనియో పిచ్చి ప్రేలాపనలు వాగుతున్నాడా? అని పాల్ ప్రశ్నించారు. పుతిన్ యుద్ధ నేరాలు ఎదుర్కోవాల్సిందేనని ఆయన అన్నారు. ఉక్రెయిన్ పై దాడి చేయవద్దని తాను పుతిన్ కు హెచ్చరిక జారీ చేసినట్లు పాల్ తెలిపారు. అయినప్పటికీ ప్రపంచం మొత్తం గుడ్లప్పగించి చూస్తుండగానే రష్యా యుద్ధం మొదలుపెట్టిందని పాల్ అన్నారు. ఉక్రెయిన్ ను రక్షించలేకపోయిన ప్రపంచ దేశాల నాయకులందరూ సిగ్గుతో తలలు దించుకోవాలని ఆయన అన్నారు. ఉక్రెయిన్ ను రక్షించాలని ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ జలెంస్కీ గత వారం జర్మనీలో తతను కోరారని పాల్ తెలిపారు. ఉక్రెయిన్ కోసం మనమంతా ప్రార్థన చేద్దాం అని పాల్ పిలుపునిచ్చారు.

Related posts

ఉమామహేశ్వరి మరణం బాధాకరం

Satyam NEWS

ఓటింగ్ లో పాల్గొనాలి

Sub Editor

మేళ్లచెరువు మండలంలో కలెక్టర్ పర్యటన

Satyam NEWS

Leave a Comment