40.2 C
Hyderabad
May 2, 2024 16: 01 PM
Slider రంగారెడ్డి

నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు: సైబారాబాద్ పోలీసులు

#cybarabadpolice

నూతన సంవత్సరం నేపథ్యంలో సైబరాబాద్ పోలీసులు బార్ లు, పబ్ ల యాజమాన్యంతో సమీక్ష సమావేశo ఏర్పాటు చేశారు. నూతన సంవత్సర వేడుకల నియంత్రణను కఠినతరం చేయాలని తెలంగాణ హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో ఈ సమావేశం ఏర్పాటు చేశారు. నూతన సంవత్సరం పార్టీలకు మైనర్లను అనుమతించవద్దని, కోవిడ్-19 నిబంధనలను పాటించాలని పబ్ మరియు బార్ యజమానులను సైబారాబాద్ పోలీసు కమిషనర్ సూచించారు. సైబరాబాద్ ట్రాఫిక్   డీసీపీ ఎస్ ఎమ్ విజయ్ కుమార్ మాట్లాడుతూ ఓమిక్రాన్‌ భయంతో పబ్‌లు, బార్‌ల యజమానులు ఆరోగ్య శాఖ విధించిన షరతులను ఉల్లంఘించరాదని కోరారు. ఆంక్షల ప్రకారం వేడుకలు నిర్వహించాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.  డిసెంబర్ 31వ తేదీ రాత్రి అన్ని ప్రాంతాల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తామని, మద్యం సేవించి వాహనాలు నడిపితే చర్యలు తీసుకుంటామని చెప్పారు.  నూతన సంవత్సర వేడుకల సమయంలో, తల్లిదండ్రులు తమ పిల్లల పట్ల అప్రమత్తంగా ఉండాలి, శాంతియుత వాతావరణంలో మాత్రమే వేడుకలు జరుపుకోవాలి మరియు వేడుకల సమయంలో కరోనా ప్రోటోకోల్ కట్టుబడి ఉండాలన్నారు. ఈ సమావేశంలో మాదాపూర్ డీసీపీ శిల్పవల్లి, శంషాబాద్ డిసిపి జగదీశ్వర్ రెడ్డి, ఏసీపీలు తదితరులు పాల్గొన్నారు.

Related posts

నకిలీ పురుగుమందులతో రైతులకు తీరని నష్టం

Satyam NEWS

గ్రామాలలో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి

Satyam NEWS

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దరిద్రపు పాలనలను సాగనంపుదాం..

Satyam NEWS

Leave a Comment