33.7 C
Hyderabad
April 30, 2024 01: 48 AM
Slider నల్గొండ

గ్రామాలలో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి

#DevarakondaMLA

గ్రామాలలో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తానని దేవరకొండ శాసన సభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు. సోమవారం నేరడుగొమ్ము మండలంలోని కచరాజుపల్లి గ్రామంలో రూ.12.60లక్షలతో నిర్మించిన స్మశాన వాటికను ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ….గ్రామ గ్రామనా వైకుంఠ ధామాలు ప్రభుత్వం మంజూరు చేసిందని ఆయన తెలిపారు. ఈ సమస్యను గతంలో ఏ ప్రభుత్వం పట్టించుకోలేదని అన్నారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా TRS ప్రభుత్వం పని చేస్తుందని ఎమ్మెల్యే తెలిపారు.

గ్రామాలలో డంపింగ్ యర్డ్స్ నిర్మాణానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందని ఎమ్మెల్యే తెలిపారు. గ్రామాలలో వైకుంఠ ధామాలు, డంపింగ్ యర్డ్స్, పల్లె ప్రకృతి వనం పనులను త్వరగతిన నాణ్యతతో పూర్తి చేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో PACS చైర్మన్ బాలయ్య,మాజీ ఎంపీపీలు ముత్యాల సర్వయ్య, లోకసాని తిరపతయ్య, ఎంపీటీసీ వాంకుణావత్ బిక్కు నాయక్, సర్పంచ్ వాంకుణావత్ నాగు నాయక్ పాల్గొన్నారు.

ఇంకా, వాడిత్య బాలు, సర్పంచులు అంజయ్య, బషీర్, ఎంపీడీఓ ఝాన్సీలక్ష్మీబాయి, PRDE ప్రవీణ్ కుమార్, AE రాజు, కేతవత్ రవీందర్, బొడ్డుపల్లి కృష్ణ, అంజి తదితరులు కూడా పాల్గొన్నారు.

Related posts

ఆస్ట్రేలియాలో మహానేత కెసిఆర్ హరిత జన్మదిన వేడుకలు

Satyam NEWS

జర్నలిస్టులను ఫ్రంట్ లైన్ వారియర్స్ గా గుర్తించాలి

Satyam NEWS

హనుమాన్ భక్తులకు ఇది శుభవార్త

Satyam NEWS

Leave a Comment