37.2 C
Hyderabad
May 2, 2024 12: 02 PM
Slider వరంగల్

సైబర్ ఫోరెన్సిక్ ల్యాబ్ ప్రారంభించిన ములుగు జిల్లా ఎస్పి

#MuluguPolice

ములుగు జిల్లా ఎస్పి క్యాంప్ కార్యాలయ సముదాయంలో సైబర్ ఫోరెన్సిక్ ల్యాబ్ ను జిల్లా ఎస్పీ ప్రారంభించారు.  ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ తెలంగాణ పోలీస్ శాఖ  అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి నేరస్తులకు శిక్ష పడే విధంగా కృషి చేయడంలో ముందంజలో ఉందని తెలిపారు.

నూతన శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించడంలో  జిల్లాలోని పోలీసు సిబ్బంది    శిక్షణ ఇవ్వాలని ఐటీ కోర్ సిబ్బందిని ఆదేశించారు. సైబర్ నేరాల నియంత్రణ కోసంభవిష్యత్ ను దృష్టిలో పెట్టుకొని  సైబర్ ఫోరెన్సిక్ ల్యాబ్ విభాగాలను భలోపేతం చేసేందుకు అవసరమైన చర్యలు చేపట్టినట్లు తెలిపారు.

నేర దర్యాప్తు సమయంలో దర్యాప్తు అధికారి కి సైబర్ ఫోరెన్సిక్ ల్యాబ్ ద్వారా త్వరితగతిన నేర నిరూపణ సమాచారం అందుబాటులోకి రానుందని ఈ సందర్భంగా తెలిపారు.

ఈ కార్యక్రమంలో ములుగు ఏ ఎస్ పి శ్రీ పి. సాయి చైతన్య ఐపీఎస్, ములుగు ఓ ఎస్ డి శ్రీ శోభన్ కుమార్,  ఎస్ బి ఇన్స్పెక్టర్ రెహమాన్, ఐటీ కోర్ సిబ్బంది కృష్ణంరాజు, రాజేంద్ర ప్రసాద్, జశ్వంత్ పాల్గొన్నారు.

కె.మహేందర్, సత్యం న్యూస్, ములుగు

Related posts

డైరెక్టర్ ఆఫ్ హెల్త్ గా నియమితులైన డాక్టర్ యు. స్వరాజ్యలక్ష్మి

Satyam NEWS

కరోనాతో బాటు ఇన్‌ఫ్లుఎంజా పై ఆందోళన

Satyam NEWS

కేసీఆర్ సేవలు దేశానికి అవసరం: మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్

Satyam NEWS

Leave a Comment