29.7 C
Hyderabad
May 3, 2024 04: 50 AM
Slider చిత్తూరు

టీటీడీ కి “జీఎస్టీ” మినహాయింపు ఇవ్వాలి!

#naveenkumarreddy

టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యులు ఏం చేస్తున్నారు? దర్శనాలు చేసుకోవడం… అయినవారికి దర్శనాలు చేయించడమే పనిగా పెట్టుకున్నారా అని ప్రశ్నించారు రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ నవీన్ కుమార్ రెడ్డి. టిటిడి ధర్మకర్తల మండలి అంటే దర్శనాలు చేయించడం కాదు శ్రీవారికి భక్తులు భక్తితో సమర్పించే ప్రతి పైసాకు జవాబుదారీతనంగా వుంటూ సామాన్య భక్తులకు మెరుగైన సేవలు అందిస్తూ దుబారా ఖర్చులు తగ్గించాల్సిన బాధ్యత ఉందని ఆయన అన్నారు.

టిటిడి ధర్మకర్తల మండలి, ఉన్నతాధికారులు జిఎస్టి మినహాయింపు పై GST council chairman కు గతంలో ఇచ్చిన విజ్ఞప్తి ఏమైంది ఎందుకు కేంద్రంపై ఒత్తిడి తీసుకురాలేకపోతున్నారు అని ఆయన ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి రాష్ట్రానికి కావాల్సిన అప్పుల కోసం అనేక పర్యాయాలు ఢిల్లీలోని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వద్దకు వెళ్తారే మరి అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకునికి కొనుగోలు చేస్తున్న ముడి సరుకులకు,శ్రీవారి భక్తులకు కేటాయిస్తున్న వసతి గదులకు జీఎస్టీ మినహాయింపు ఇవ్వాలని ఏనాడైనా ఏపీ ఆర్థిక మంత్రి అడిగారా అని ఆయన ప్రశ్నించారు.

శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు లాభాపేక్షతో కాకుండా మెరుగైన వసతి కల్పించాల్సిన బాధ్యత టిటిడి అధికారులపై వుందని ఆయన అన్నారు. ఢిల్లీలోని టీటీడీ లోకల్ అడ్వైజరీ కమిటీ చైర్మన్ సభ్యులు “ఉత్సవ విగ్రహాలలా” మారారు ప్రతి 90 రోజులకు ఒకసారి ఢిల్లీలో జరిగే జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో టీటీడీ కి జీఎస్టీ మినహాయింపు ఇవ్వాలని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిని,అధికారులను కలిసిన దాఖలాలు లేవు.

తిరుమల ఆధ్యాత్మిక కేంద్రమే తప్ప వ్యాపార కేంద్రం కాదు అన్న విషయాన్ని పాలకులు అధికారులు గుర్తించాలి భక్తులపై భారం మోపే విధంగా ఇస్తానుసారంగా శ్రీవారి,పద్మావతి అమ్మవారి సేవ టికెట్ల ధరలు పెంచారు,ప్రసాదాల ధరలు పెంచారు,అద్దె గదుల ధరలు పెంచారు ఇలా పెంచుకుంటూ పోతే భక్తులు తిరుమల కొండ వైపు చూడాలంటే భయపడే పరిస్థితిలు వస్తాయి! టిటిడి చైర్మన్ జిఎస్టి కౌన్సిల్ చైర్మన్ కు జిఎస్టి మినహాయింపు పై ఇచ్చిన లేఖ తనకు ఇస్తే శ్రీవారి భక్తునిగా CGST యాక్ట్ 2017 సెక్షన్ 11 ప్రకారం చట్టపరంగా ముందుకెళ్తానని నవీన్ అన్నారు.

Related posts

రాజంపేట 23% ఫిట్ మెంట్ జీవో కాపీల దహనం

Satyam NEWS

‘అన్నగారి విగ్రహంలో మీ భాగస్వామ్యం కావాలి’

Satyam NEWS

ఎక్కువ మంది అభిమానించే ఆన్‌లైన్‌  గ్రోసరీ స్టోర్‌గా బిగ్‌బాస్కెట్‌

Satyam NEWS

Leave a Comment