38.2 C
Hyderabad
May 3, 2024 20: 38 PM
Slider ముఖ్యంశాలు

దళిత జర్నలిస్టులకు దళిత బంధు పథకం అమలు చెయ్యాలి

#Allam Narayana

దళిత జర్నలిస్టులకు దళిత బంధు పథకం ప్రత్యేకంగా వర్తింప చేసేందుకు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానని జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాల కోసం కృషి చేస్తామని ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ హామీ ఇచ్చారు. తెలంగాణ ఎస్సీ, ఎస్టీ వర్కింగ్ జర్నలిస్టుల అసోసియేషన్ ఆధ్వర్యంలో నాయకులు హైదరాబాదులోని ప్రెస్ అకాడమీ

కార్యాలయంలో బుధవారం అల్లం నారాయణ కలిసి దళిత గిరిజన జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా తెలంగాణ ఎస్సీ, ఎస్ టి వర్కింగ్ జర్నలిస్టుల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు కట్కూరి మల్లేష్, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బందెల రాజశేఖర్ మాట్లాడుతూ దళిత గిరిజన జర్నలిస్టులు ప్రతి నియోజకవర్గంలో

30 నుండి 50 వరకు మంది వివిధ పత్రికల్లో పని చేస్తున్నారని, ఏళ్ల తరబడి పనిచేస్తున్నప్పటికీ వారికి ఆర్థిక స్తోమత లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న దళిత బంధు పథకం దళిత జర్నలిస్టులకు వర్తింప చేసేందుకు తమ వంతు కృషి చేయాలని, దళిత గిరిజన జర్నలిస్టులకు ఇండ్లు లేదా ఇంటి

స్థలాలు ఇప్పించేందుకు తమ వంతుగా కృషి చేయాలని దళిత గిరిజన జర్నలిస్టుల పిల్లలకు విద్యాసంస్థల్లో 100% రాయితీ కల్పించాలని, ప్రైవేటు ఆసుపత్రుల్లో రాయితీ కల్పించాలని ఎస్సీ ఎస్టీ వర్కింగ్ జర్నలిస్టుల అసోసియేషన్ తరపున జిల్లాలోని అక్రిడేషన్ కమిటీలో అవకాశం కల్పించాలని కోరారు. అందుకు స్పందించిన అల్లం నారాయణ దళిత,

గిరిజనుల జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల కోసం ఇప్పటికే మంత్రి కేటీఆర్ తో చర్చించడం జరిగిందని త్వరలోనే ముఖ్యమంత్రిని కలిసి దృష్టికి తీసుకెళ్తానని దళిత జర్నలిస్టులకు దళిత బంధు పథకం అమలు చేసేందుకు తన వంతుగా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం ప్రెస్ అకాడమీ కార్యదర్శి

వెంకటేశ్వర్లు, సమాచార శాఖ మరియు పౌర సంబంధాల శాఖ డైరెక్టర్ చంద్రమౌళి కలిసి దళిత గిరిజన జర్నలిస్టుల సమస్యలపై వినతిపత్రం అందజేశారు.

జి లాలయ్య సత్యం న్యూస్ జుక్కల్ నియోజకవర్గం

Related posts

పాకిస్తాన్ లో త్వరలో సార్వత్రిక ఎన్నికలు?

Satyam NEWS

బాధిత కుటుంబాలకు సిఎంఆర్ఎఫ్ పంపిణీ

Satyam NEWS

విద్యతోనే ఉన్నత లక్ష్యాలు చేరుకోవచ్చు

Bhavani

Leave a Comment