28.7 C
Hyderabad
May 6, 2024 09: 30 AM
Slider మహబూబ్ నగర్

దళిత బంధు లబ్ధిదారులకు ఆదాయం రెట్టింపు అయ్యేలా చూడాలి

#nagarkurnool

దళిత బంధు లబ్ధిదారులు వారి అనుభవం, వృత్తి నైపుణ్యత ఆధారంగా సంవత్సరం లోపు రెట్టింపు ఆదాయం వచ్చే యూనిట్లను ఎంపిక చేసుకునేలా, అధికారులు యూనిట్ల రూపకల్పన చేయాలని నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ ఉదయ్ కుమార్ అధికారులను ఆదేశించారు.

గురువారం సాయంత్రం కలెక్టరేట్ సమావేశ మందిరంలొ దళిత బంధు పథకం నాగర్ కర్నూల్ జిల్లా లోని నాలుగు నియోజకవర్గాల పరిధిలో 400 మంది లబ్ధిదారులకు యూనిట్ల ఎంపికలకు ఆయా శాఖల పరిధిలో నిర్వహించే యూనిట్ల రూపకల్పనకు జిల్లా అధికారులతో  కలెక్టర్ ఉదయ్ కుమార్ సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దళితబంధు పథకం క్రింద యూనిట్ల ఎంపికకు ఆదాయ వనరులు రెట్టింపు అయ్యేలా యూనిట్ల ఎంపిక జరగాలని కలెక్టర్ తెలిపారు. దళితబంధు క్రింద లబ్ధిదారులు యూనిట్ స్థాపించుకొనుటకు శాఖల అధికారులు మంచి ఆదాయం వచ్చే యూనిట్లను రూపొందించి రేపటిలోగా ఎస్సీ కార్పొరేషన్ అధికారికి అందజేయాలని ఆదేశించారు.

లబ్ధిదారులు యూనిట్ల ఎంపికకు జిల్లా అధికారులు పూర్తి అవగాహన పెంపొందించే విధంగా యూనిట్ల రూపకల్పన జరగాలని తెలిపారు. లబ్ధిదారులు ఆర్థికంగా అభివృద్ధి సాధించుటకు తక్కువ సమయంలో ఎక్కువ ఆదాయం సమకూర్చే మంచి యూనిట్లను ఎంపిక చేసుకునేలా రూపకల్పన చేయాలనన్నారు.

కొందరూ పాడి గేదెలు (డైయిరీ యూనిట్లు), గూడ్స్ ట్రేలర్, ట్రాక్టర్ ట్రేలర్, ఏర్టిగా కారు, సూపర్ బజార్, టైలరింగ్, ఎంబ్రాయిడరీ, లేడీస్ ఎంపోరియం యూనిట్ లు ఎంపిక చేసుకుంటారని తెలిపారు. వాహనాలు ఎంపిక చేసుకునే వారే 50 శాతం మంది ఉంటారని తెలిపారు.

డైయిరీ యూనిట్లను ఎంచుకునే లబ్ధిదారులకు డైయిరీ నిర్వాహణ పై అవగాహన పెంపొందించుటకు పాడి గేదెల రకాలు డైయిరీ నిర్వాహణ, దాన, పాలు తీయడం, ఎలా మార్కెటింగ్ చేయాలనే విషయాల పై యూనిట్ల రూపకల్పన పూర్తి అవగాహన పెంపొందించాలని జిల్లా పశు సంవర్ధక శాఖాధికారిని ఆదేశించారు.

డైయిరీ యూనిట్లు ఎంపిక చేసుకున్న వారికి 5 పాడి గేదెలు, షెడ్డు నిర్మాణం, ఇన్సూరెన్సు, ఒక సంవత్సరం దాన కు అగు మొత్తం ఖర్చుకు ప్రణాళీకలు తయారు చేసి సమర్పించాలని ఆదేశించారు. అలాగే విత్తనాలు, ఎరువుల షాపు యూనిట్లను ఎంచుకున్న వారికి అవసరమైన లైసెన్సును ఇప్పించాలని వ్యవసాయాధికారిని ఆదేశించారు.

మినీ కిరాణం షాపులు, టెంట్ హౌజ్ యూనిట్లు ప్రొడక్ట్స్ వ్యాన్లు, బోర్లు తదితర యూనిట్ల రూపకల్పన చేయాలని ఆదేశించారు. జిల్లాలో ప్రత్యేకంగా నిర్వహించే యూనిట్ల ఏర్పాట్లకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. కొంతమంది సమూహంగా కలిసి నిర్వహించే యూనిట్ల పై రూపకల్పన చేయాలన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ మను చౌదరి, జిల్లా షేడ్యూల్డ్ కులాల సంక్షేమాధికారి రాం లాల్, జిల్లా పశుసంవర్ధక శాఖాధికారి డాక్టర్ రమేష్, జిల్లా అధికారులు రమాదేవి, మోహన్ బాబు, కృష్ణ, రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు.

అవుట రాజశేఖర్, సత్యంన్యూస్.నెట్

Related posts

మినీ మహానాడు కు విజయనగరం జిల్లా టీడీపీ సన్నద్ధం

Satyam NEWS

మోడల్ గజ్వేల్: అతి సుందరం అద్భుత సౌకర్యం

Satyam NEWS

జీహెచ్ఎంసి ఎన్నికలకు అస్త్రశస్త్రాలు సిద్ధం

Sub Editor

Leave a Comment