26.7 C
Hyderabad
May 3, 2024 09: 46 AM
Slider హైదరాబాద్

తెలంగాణ ఉద్యమకారుడికి దక్కిన దళిత బంధు

#dalitbandhu

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న దళిత బంధు పథకం కింద తెలంగాణ ఉద్యమకారుడు బీ.వీ.రమణకి ఉపాధి దొరికింది. శనివారం అంబర్ పేట నియోజకవర్గ పటేల్ నగర్ కు చెందిన తెలంగాణ ఉద్యమకారుడు బీ.వీ.రమణకి మంజూరైన వాహనాన్ని అంబర్పేట్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ అందచేశారు. కార్పొరేటర్ విజయ్ కుమార్ గౌడ్ కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో అంబర్పేట్ డివిజన్ అధ్యక్షుడు సిద్దు, నల్లకుంట డివిజన్ అధ్యక్షుడు మేడి ప్రసాద్, దళిత బంధు పథకం కోఆర్డినేటర్లు ఆర్కే బాబు, రెడ్డి పాక రాము, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు లింగారావు తదితరులు  పాల్గొన్నారు. ఉద్యమకారుడు బి.వి.రమణ కుటుంబ సమేతంగా మాట్లాడుతూ తనను గుర్తించి దళిత బంధు పథకానికి అర్హుడుగా ఎంపిక చేసినటువంటి ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ కి, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకి రుణపడి ఉంటానని దళితులు అందరూ ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సత్యం న్యూస్, అంబర్పేట

Related posts

ఈ నెల 7 నుంచి “జగనన్నే మా భవిష్యత్తు”..!

Bhavani

అధిక ధరలకు అమ్మితే కేసు గ్యారెంటీ

Satyam NEWS

ఫిర్యాదు దారులకు త్వరితగతిన న్యాయం

Sub Editor

Leave a Comment