40.2 C
Hyderabad
April 26, 2024 11: 23 AM
Slider కడప

ఫిర్యాదు దారులకు త్వరితగతిన న్యాయం

kadapa SP

క‌డ‌ప‌ జిల్లా ఎస్.పి కే.కే.ఎన్.అన్బురాజన్ ఐ.పి.ఎస్ సోమవారం జిల్లా పోలీసు కార్యాలయం నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ‘స్పందన’ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ సందర్బంగా జిల్లా ఎస్.పి గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉన్నఫిర్యాదు దారులతో నేరుగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఫిర్యాదు దారుల సమస్యలను నిర్ణీత సమయంలో విచారించి పరిష్కరిస్తామని ఎస్.పి భరోసా ఇచ్చారు.

జిల్లాలోని ఫిర్యాదుదారులు ‘స్పందన’ ఫిర్యాదులను వారి వారి వార్డు, గ్రామ సచివాలయంలోని మహిళా పోలీసు (గ్రామ మహిళా సంరక్షణ కార్యదర్శి)లకు అందచేయాలని, వారు ఫిర్యాదులను జిల్లా పోలీసు కార్యాలయానికి స్కాన్ చేసి పంపుతార‌న్నారు.

ఫిర్యాదులను సంబంధిత వార్డు, గ్రామ సచివాలయాలు పరిధిలోని పోలీసు అధికారులు విచారించి న్యాయం చేస్తారని జిల్లా ఎస్.పి తెలిపారు. జిల్లాలోని ప్రజలు ఈ అవకాశాన్నిసద్వినియోగం చేసుకోవాలని ఎస్.పి సూచించారు. ‘కరోనా’ వైరస్ తీవ్రత దృష్ట్యా వ్యయ ప్రయాసలకోర్చి జిల్లా కేంద్రానికి రావాల్సిన అవసరం లేకుండా ఫిర్యాదు దారులకు మరింత చేరువయ్యేందుకు ఈ విధానం రూపొందించామ‌ని ఎస్పీ తెలిపారు.

Related posts

గిరిజన విద్యార్థులకు మంచి ర్యాంకులు రావాలి

Bhavani

న్యూ టార్గెట్: బాబాయ్ శ్రవణ్ మా నాన్నను కొట్టేవాడు

Satyam NEWS

మానసిక,శారీరక ఆరోగ్య ప్రదాయిని యోగా

Satyam NEWS

Leave a Comment