37.2 C
Hyderabad
April 30, 2024 11: 30 AM
Slider ప్రత్యేకం

దళిత గిరిజన జర్నలిస్టులకు రక్షణ చట్టం చేయాలి

రాష్ట్రంలో దళిత గిరిజన జర్నలిస్టులపై అక్రమ కేసులు దాడులను అరికట్టాలని వారికి భద్రత కల్పించాలని కోరుతూ తెలంగాణ ఎస్సీ ఎస్టీ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర అధ్యక్షులు కటుకూరి మల్లేష్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బందెల రాజశేఖర్ శనివారం ఉదయం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో హోంమంత్రిని తన చాంబర్ లో కలిసి వినతి పత్రం అందజేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో వివిధ పత్రికలు టీవీ ఛానల్ లో దళిత గిరిజన జర్నలిస్టులు పనిచేస్తున్నారని వార్తలు కవరు చేసే సమయాల్లో జర్నలిస్టులపై రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిల నుండి దాడులు పెరుగుతున్నాయని అదేవిధంగా కొన్నిచోట్ల అవినీతి అక్రమాలకు సంబంధించిన వార్తలు రాసే వారిపై పోలీసుల ద్వారా అక్రమ కేసులు కూడా నమోదు అవుతున్నాయని మంత్రి మహమ్మద్ ఆలీ దృష్టికి తీసుకువెళ్లారు.

దళిత గిరిజన జర్నలిస్టులపై జరుగుతున్న దాడులను అరికట్టాలని జర్నలిస్టులపై అక్రమ కేసులను నియంత్రించాలని జర్నలిస్టులకు భద్రత కల్పించాలని కోరారు. అదేవిధంగా దళిత గిరిజన జర్నలిస్టుల దాడులకు సంబంధించిన ఒక రక్షణ చట్టం తీసుకురావాలని మంత్రిని కోరారు. అందుకు హోం మంత్రి సానుకూలంగా స్పందిస్తూ రాష్ట్రంలో ఎక్కడైనా జర్నలిస్టులపై దాడులు జరిగిన అక్రమ కేసులు నమోదైన మొదటగా పోలీసులకు ఫిర్యాదు చేయాలని న్యాయం జరగకుంటే తన దృష్టికి తీసుకురావాలని తప్పకుండా దాడులను నియంత్రించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టులకు అన్ని విధాల అభివృద్ధి సంక్షేమ పథకాలు అందజేస్తుందని జర్నలిస్టులు మంచి ఉద్దేశంతో వార్తలు రాయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు.

జి. లాలయ్య సత్యం న్యూస్ జుక్కల్ నియోజకవర్గం

Related posts

హైదరాబాద్ ఎయిర్ పోర్టులో భారీ ఎత్తున హెరాయిన్ స్వాధీనం

Satyam NEWS

హెల్పింగ్ హ్యాండ్: కొనసాగుతున్న సహాయక చర్యలు

Satyam NEWS

వరి ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయండి

Satyam NEWS

Leave a Comment