37.2 C
Hyderabad
May 6, 2024 22: 42 PM
Slider నెల్లూరు

వై ఎస్ జగన్ హయాంలో వివక్షకు గురి అవుతున్న దళితులు

#Nellore Dalit Meeting

వైసీపీ ప్రభుత్వం హయాంలో దళితులు వివక్ష కు గురవుతున్నారని షెడ్యూల్ కులాల ఐక్యవేదిక వెల్లడించింది. జగన్ మోహన్ రెడ్డి ఏడాది పాలన పై మాట్లాడితే దళితులను అరెస్టులు చేయడాన్ని ఐక్యవేదిక తీవ్రంగా ఖండించింది. రాష్ట్రంలో దళిత వర్గాల పై జరుగుతున్న దాడులపై నెల్లూరు నగరంలో షెడ్యూల్ కులాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది.

ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు గ్రామంలో  విద్యుత్ ఘాతం లో దళితులు చనిపోతే ప్రభుత్వం ఇంతవరకు ఎటువంటి నష్ట పరిహారం చెల్లించలేదని ఐక్యవేదిక వెల్లడించింది. టీడీపీ హయాంలో భూ సంస్కరణలతో భూములు లేని దళితులకు సి జే ఎఫ్ ఎస్ స్కీం ద్వారా ఇచ్చిన భూములను జగన్ ప్రభుత్వం ఇళ్ల స్థలాల పేరుతో లాక్కుంటున్నదని ఐక్యవేదిక తెలిపింది.

దళితుల దగ్గర భూములను లాక్కోవడాన్ని ఐక్యవేదిక తీవ్రంగా ఖండించింది. నర్సీపట్నం ప్రభుత్వ వైద్యుడు డాక్టర్ సుధాకర్ పై దాడి, కచ్చులూరు బోటు ప్రమాదం ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా జరిగిందని మాట్లాడిన హర్ష కుమార్ పై అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపడం వంటి చర్యలను దళిత సంఘాలు ఐక్య వేదిక ద్వారా ఖండించారు.  

రాబోయే రోజుల్లో దళితులపై ఇలాగే దాడులు కొనసాగితే రాష్ట్రంలో దళితుల అందరూ ఏకమై జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని ఐక్యవేదిక వెల్లడించింది. ఈ కార్యక్రమంలో తెదేపా రాష్ట్ర కార్యదర్శి జెమిని రమణయ్య, టిడిపి ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు శ్రీపతి బాబు, ఎస్సీ ఎస్టీ కమిషన్ సభ్యులు బద్దెపూడి రవీంద్ర బాబు, మాల మహానాడు జిల్లా అధ్యక్షులు వెంకటరమణ పాల్గొన్నారు.

ఇంకా, ఏపీ ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు ఏసుకో బాబు, యునైటెడ్ ఫోరం రాష్ట్ర కార్యదర్శి బాబు, ఈదురు విజయ్ కుమార్, ఎస్సీ సంఘాల జిల్లా అధ్యక్షులు వెంకటయ్య , సీమాంధ్ర ఎమ్మార్పీఎస్ నాయకులు పందిరి సుబ్బయ్య, మందా రవికుమార్, దాసు, శైలేంద్ర బాబు, విజయ రాజు, మరియు దళిత సంఘాల నాయకులు పాల్గొన్నారు.

Related posts

టీ20 ప్రపంచకప్‌లో సరికొత్త రికార్డు సృష్టించిన భారత్‌

Sub Editor

కేరళ సింగర్ జగ్గీ జాన్ అనుమానాస్పద మృతి

Satyam NEWS

మంత్రి ఎర్ర‌బెల్లిని క‌లిసిన బ్రాహ్మ‌ణ సేవా సంఘం నూత‌న కార్య‌వ‌ర్గం

Satyam NEWS

Leave a Comment