29.7 C
Hyderabad
May 3, 2024 06: 33 AM
Slider కవి ప్రపంచం

అరచేతి లో ప్రాణం

#J.Kondanna Gowlipura

అకలి యుధ్ధంలో గెలవాలని

సైనికుడు యుధ్ధసామాగ్రి మోస్తూ

పోరుకు సన్నధ్ధమైతున్నట్లు

నెత్తిన సంకలో చేతిలో బతుకు బరువు మోస్తూ

ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని నడుస్తూ

తోడు నీడ వెంటపెట్టుకొని

ఎండ కొడుతున్నా

చలి పెడుతున్నా

వానకు తడుస్తున్నా

చూపులు పని దొరికే చెంతకు

ఊరిలో తల్లి పిల్ల కుక్క కళ్లతెరపై కదులు తున్నా

ఆనకట్టలు వరి కోతలు

మహానగరాల తారభవంతులు

పనికి పరుగులే

ఎముకలు విరిగిన రోగం రొంప వచ్చిన

యజమానుల బూతులు విన్న

పొట్ట బాబు పొట్ట

మట్టిలో మట్టి కలసే వరకూ

వలస బతుకులు కథింతే

దేశమంతా  మట్టి దేహాలు

గుడిసెల్లో గుడారల్లో వెలిగె గుడ్డి దీపాలు

రేడియమ్(జె.కొండన్న) గౌలిపుర, పాతనగరం, హైదరాబాద్ సెల్: 9291527757

Related posts

కాలనీల సమస్యల దశలవారీగా పరిష్కారానికి కృషి

Satyam NEWS

వైఎస్ఆర్ లా నేస్తం పథకం మార్గదర్శకాల విడుదల

Satyam NEWS

ఐ‌టి రంగం ద్వారా 10 లక్షల మందికి ఉపాధి

Murali Krishna

Leave a Comment