30.7 C
Hyderabad
April 29, 2024 05: 22 AM
Slider ముఖ్యంశాలు

మధ్యాహ్నానికి తీరం దాటనున్న నిసర్గ తుపాను

#Weather Forecast

ముంబైకి దక్షిణ నైరుతి దిశగా సుమారు 200 కిలో మీటర్ల దూరాన నిసర్గ తీవ్ర తుపాను కేంద్రీకృతం అయింది. ఇది ఈ రోజు మధ్యాహ్నానికి మహారాష్ట్రలో గుజరాత్ సరిహద్దుకు ఆనుకుని ఉన్న అలిబాగ్ వద్ద తీరం దాటుతుంది. గంటకు 120 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీస్తాయి.

రేపటికల్లా ఇది వాయుగుండంగా బలహీన పడుతుంది. రుతుపవనాల వ్యాప్తి కొనసాగుతోంది. ఈ రోజు తెలంగాణలో కొన్ని చోట్ల 40-50 కిలోమీటర్ల వేగంతో గాలివానలు పడతాయి. కొన్ని చోట్ల భారీ వర్షం పడుతుంది. కోస్తాంధ్ర, రాయలసీమల్లో కొన్ని చోట్ల 30-40 కిలోమీటర్ల గాలివేగంతో ఉరుములతో కూడిన వర్షాలు పడతాయి. రాయలసీమలో భారీ వర్షాలు పడతాయి. ఏపిలో మిగతా ప్రాంతాల్లో 41 నుంచి 43 డిగ్రీల ఎండలు కాస్తాయి.

Related posts

పటాన్చెరులో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన

Satyam NEWS

కానిస్టేబుల్ కుటుంబానికి ఆర్ధిక సహాయం చేసిన పోలీసులు

Satyam NEWS

సేవా హై య‌జ్ఝ కుండ్ స‌మిదామే హ‌మ్ స‌బ్ జలే..!

Satyam NEWS

Leave a Comment