26.7 C
Hyderabad
May 3, 2024 09: 49 AM
Slider ముఖ్యంశాలు

రాంచరణ్, ఉపాసన లకు కూతురు

#Ram Charan

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తండ్రి అయ్యాడు. చెర్రీ భార్య ఉపాసన హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రిలో ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. దీంతో ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తోన్న మెగా ఫ్యామిలీలో మాటల్లో చెప్పలేని ఆనందం నెలకొంది.

ఈ విషయం తెలియడంతో రామ్ చరణ్, ఉపాసన కూతురిని చూసేందుకు మెగా ఫ్యామిలీ మెంబర్స్ అపోలో ఆసుపత్రికి క్యూ కట్టారు. ముఖ్యంగా రామ్ చరణ్ తండ్రి, మెగాస్టార్ చిరంజీవి మనవరాలు పుట్టిందని తెలియగానే పట్టిరాని ఆనందంతో అపోలో ఆసుపత్రికి వెళ్లారు.

మనువరాలిని చూసి చిరు ఎంతో మురిసిపోయారు. ఇక, రామ్ చరణ్‌కు కూతరు పుట్టిందన్న వార్త తెలియగానే చెర్రీ ఫ్యాన్స్, మెగా అభిమానులు జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రికి భారీగా చేరుకున్నారు. ఆసుపత్రి వద్ద ఫ్లెక్సీలతో చెర్రీ, ఉపాసన దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

ఫ్యాన్ భారీగా రావడంతో అపోలో ఆసుపత్రి సిబ్బంది వారి కోసం ప్రత్యేకంగా గ్యాలరీ ఏర్పాటు చేసింది. మరోవైపు సోషల్ మీడియాలో రామ్ చరణ్, ఉపాసన దంపతులకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఈ జోడికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

Related posts

ములుగు జిల్లా పై గులాబీ జెండా ఎగరవేయడం  ఖాయం

Satyam NEWS

మల్లంపల్లి మండల సాధన కమిటీకి పెరుగుతున్న మద్దతు

Satyam NEWS

పోలీస్ స్టేషన్ లో సజీవదహన యత్నం

Bhavani

Leave a Comment