38.2 C
Hyderabad
May 1, 2024 22: 42 PM
Slider జాతీయం

గంగా నదిలో ఇంకా కొట్టుకువస్తున్న కరోనా శవాలు

#GangaRiver

కరోనా మరణాలను కప్పిపుచ్చేందుకు ప్రభుత్వాలు చేస్తున్న ప్రయత్నాలకు ప్రకృతి సహకరించడం లేదు. ఇటీవల గంగానదిలో కరోనా మృతదేహాలు కొట్టుకువచ్చి దేశవ్యాప్తంగా సంచలనం కలిగించిన విషయం తెలిసిందే. తాజాగా కురుస్తున్న భారీ వర్షాలలో నది ఒడ్డున పాతిన కరోనా మృతదేహాలు కొట్టుకొని వచ్చి నదిలోకి చేరుతున్నాయి. దాదాపు 2 వేల శవాలు ఈ విధంగా నదిలోకి కొట్టుకువెళ్లినట్లు అంచనా వుంది. ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాలలో కరోనా మృతులను నదిలో పడేయడమూ, నది ఒడ్డున నామమాత్రంగా గుంతలు తీసి పూడ్చి పెట్టడమో చేస్తున్నారు. ఇలా అరకొరగా పూడ్చి పెట్టిన శవాలు కురుస్తున్న వానలతో నదిలో కొట్టుకువస్తున్నాయి. బీహార్ లోని బుక్సార్ జిల్లాలో 71 శవాలు కొట్టుకురాగా దీన్ని కేంద్రం సీరియస్ గా తీసుకున్నది. ఈ సంఘటన జరిగిన తర్వాత ఉత్తరప్రదేశ్ లోని పలు ప్రాంతాల నుంచి ఇలా శవాలు కొట్టుకురావడం మరింత ఎక్కువ అయింది. గంగానది ఒడ్డున ఉన్న కాన్పూర్, ఉన్నావో, ఘాజియాపూర్, కన్నొజ్, బాలియా, ఘాజీపూర్ జిల్లాల నుంచి ఇలా కరోనా శవాలు కొట్టుకువస్తున్నట్లు గుర్తించారు.

Related posts

మహిళా కార్మికుల్ని వేధిస్తున్న సూపర్ వైజర్ కు దేహశుద్ధి

Satyam NEWS

అరసవల్లి టు అమరావతి పాదయాత్ర కు నవతరంపార్టీ మద్దతు

Satyam NEWS

అత్యాధునిక సాంకేతికతతో విజయనగరం పోలీసు శిక్షణ కళాశాల ఆధునికీకరణ

Satyam NEWS

Leave a Comment