28.7 C
Hyderabad
April 27, 2024 06: 15 AM
Slider విజయనగరం

అత్యాధునిక సాంకేతికతతో విజయనగరం పోలీసు శిక్షణ కళాశాల ఆధునికీకరణ

#vijayanagarampolice

విజయనగరం  పోలీసు శిక్షణా కళాశాల ప్రిన్సిపల్ గా 2019 నుంచీ ఈ ఏడాది నవంబర్ 11 వరకు పనిచేసిన డి.రామచంద్రరాజు ఆధ్వర్యంలో పోలీసు శిక్షణా కళాశాల ప్రాంగణాన్ని అత్యాధునిక సాంకేతికతతో ఆధునీకరించారు. ఇందులో భాగంగా మినw కాన్ఫరెన్స్ హాల్, మైదానం, అడ్మినిస్ట్రేటివ్ భవనం, కిచెన్, ట్రైనీస్ బ్యారక్స్, బర్డ్స్ పార్క్ లు ఆధునీకరించడంతో పాటు, క్రొత్తగా డ్రైవింగ్ ట్రైనింగ్ సిమ్యులేటర్, సిసి కెమారాల నిఘాను ఏర్పాటు చేశారు.

ప్రభుత్వ నిధులమీద భారం పడకుండా ప్రిన్సిపాల్ రామచంద్రరాజు  స్థానికంగా ఉన్న పరిచయాలను బట్టి పిటిసి అభివృద్ధికి ఎన్నోఅభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. ఈ కార్యక్రమాలలో పిటిసి సిబ్బంది, అధికారులు అందరూ తమవంతు సహాయ సహకారాలు అందించారు.

శిక్షణాలయం మన ఇల్లు లాంటిది

మన ఇంటిని ఎంత శుభ్రంగా ఉంచుకొంటామో అంత శుభ్రంగా ఉంచుకోవాలని, శిక్షణాలయంలో ఉండే సిబ్బంది అంతా ఒక కుటుంబంలాగా పనిచేయాలని, ఎటువంటి ఒత్తిడిలకు, ప్రలోభాలకు లోనుకాకుండా కృషి చేసి ఉన్నత విలువలు కలిగిన శిక్షణ కేంద్రంగా తీర్చిదిద్దడంలో బదిలీపై వెళ్ళిన ప్రిన్సిపల్ డి. రామచంద్రరాజు చేసిన కృషి ఎనలేనిది.

పరేడ్ మైదానంలో అత్యున్నత ప్రమాణాలతో 8 లైన్లతో కూడిన 400 మీటర్ల ట్రాక్ నిర్మాణం, ట్రాక్ చుట్టూ రాత్రిపూట శిక్షణార్థులకు ఉపయోగపడే విధంగా లైట్లు ఏర్పాటు, శిక్షణార్థులు పరేడ్ మైదానంలో పరేడ్ కొరకు సిద్ధంగా ఉండేందుకు బ్లాక్ టాప్ రోడ్డుతో బేస్ లైను నిర్మాణం, ఎక్కువ మంది శిక్షణార్ధులు ఒకేసారి శిక్షణ పొందేందుకు వీలుగా, అదనంగా మరో రెండు 400 మీటర్ల ట్రాల నిర్మాణం చేశారు.

నీటి అందుబాటుకు చర్యలు

మైదానంలో వర్షపు నీరు వెళ్ళే విధంగా అండర్ గ్రౌండ్ కెనాల్ నిర్మాణం, శిక్షణార్ధులకు అవుట్ డోర్ క్లాసులు చెప్పేందుకు వీలుగా ట్రైనింగ్ స్క్వాడ్ పోస్టుల నిర్మాణం, పరేడ్ మైదానం చుట్టూ సోలార్ లైట్లు ఏర్పాటు, ఒక బోరుబావి తీయించి, గ్రౌండుకు అన్నివైపులా పైపులైన్లతో వాటర్ ట్యాప్స్ ఏర్పాటు, మైదానం చుట్టుప్రక్కలా గార్డెనింగ్, మైదానం చుట్టూ 1.1 కిలోమీటర్ల ఫుట్ ట్రాక్ నిర్మాణం చేశారు.

శిక్షణా మైదానంలో డయాస్ రూఫ్ సీలింగ్, టైల్స్ తో ఆధునీకరించారు. శిథిలావస్థలో ఉన్న పాత బిల్డింగ్ ను మిని కాన్ఫెరెన్స్ హాలుగా ఆధునీకరించి ఆధునిక సాంకేతికతతో ఆన్లైన్ లో వర్చువల్ మీటింగ్లు మరియు కంప్యూటర్ పరిజ్ఞానం గురించి శిక్షణనిచ్చే విధంగా చేశారు.

అత్యాధినికమైన కంప్యూటర్లు, ఎల్ ఈడి స్క్రీను, ఫర్నీచర్, గార్డెన్ ఏర్పాటు. మినీ కాన్ఫెరెన్స్ హాలు తయారుచేసుకోవడం వలన ఉన్నతాధికారుల సహాయ సహకారాలతో రాష్ట్రంలోనే మొదటగా ఆన్ లైన్ కోర్సులతో శిక్షణనిచ్చి ఉన్నతాధికారుల మన్ననలు పొందారు.

ఆన్ లైన్ శిక్షణ కోసం ఏర్పాట్లు

కోవిడ్ సమయంలో ఆన్ లైన్ లో శిక్షణనిచ్చేందుకు, మహిళా పోలీసులకు శిక్షణనిచ్చేందుకు వీడియోలు తయారు చేయడానికి, ఎపివిపిఎ ద్వారా ఆన్లైన్ కోర్సులలో శిక్షణనిచ్చేందుకు, ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫెరెన్స్ లో పాల్గొనడానికి వీలుగా ఉపయోగపడింది.

పీటీసీ అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ నందు సరస్వతి విగ్రహం నిర్మాణం, శిక్షణార్ధులకు డ్రైవింగ్ నందు శిక్షణనిచ్చేందుకు వీలుగా ప్రభుత్వం నుండి మంజూరు కాబడిన 80 లక్షల నిధులతో అత్యాధునిక సాంకేతికతతో ఇండోర్ డ్రైవింగ్ ట్రైనింగ్ సిమ్యులేటర్ యూనిట్ ఏర్పాటు చేయుటకు విశేషంగా కృషి చేశారు. అర్ధమయ్యే రీతిలో బోధించేందుకు క్లాస్ రూములలో ఎల్ఈడి ప్రొజెక్టర్ లు, కంప్యూటర్లు ఏర్పాటు, క్లాసు రూములలో ఫర్నీచర్ ఏర్పాటు, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసునందు ఆదునీకరించి ఉద్యోగులు పనిచేసుకొనేందుకు క్యూబికల్ డెస్క్ లు ఏర్పాటు, ఉమెన్ ఫేకల్టీ రూము ఏర్పాటు చేశారు.

కోవిడ్ నుండి శిక్షణార్థులకు రక్షణ – కరోనా వైరస్ విస్తృతంగా ప్రబలిన సమయంలో 400 మంది శిక్షణార్ధులకు ఎటువంటి, అలసత్వానికి, ప్రలోభాలకు లోనుకాకుండా శిక్షణార్ధులలో ఏ ఒక్కరికీ కూడా కోవిడ్ సోకకుండా అన్ని కోవిడ్ జా గ్రత్తలు తీసుకొని, కృషి చేసి శిక్షణార్ధులలో ఎవ్వరినీ కోవిడ్ బారిన పడకుండా రక్షించి శిక్షణను మగించడంలో విజయవంతమయ్యారు.

క్యాంటిన్ లో నాణ్యమైన ఆహారం

ఈ విషయంలో ఉన్నతాధికారులు అభినందించారు. శిక్షణార్ధులకు మంచి మెనూను అమలు చేసి, నాణ్యమైన ఆహారాన్ని, పోషకవిలువలున్న ఆహారం మునుపెన్నడూ లేని విధంగా సమకూర్చడంలో విశేష కృషి చేశారు. ఎప్పుడూ కనీవినీ ఎరుగని రీతిలో అందరు శిక్షణార్థులకు మంచి పౌష్టిక ఆహారాన్ని అందించారు. శిక్షణార్ధులకు వసతి సౌకర్యాలు కల్పించడంలో కృషి చేసి వారి మంచాలను రిపేరు చేయించడం జరిగింది.

అన్ని బ్యారక్ లోని షూరేకు ఏర్పాటు చేయడం, బాత్ రూములను ఆధునీకరించడం, కొత్తగా బాత్ రూంల నిర్మాణం చేపట్టారు. శిక్షణార్థుల బ్యారక్స్ అధునీకరణ – పిటిసిలో శిక్షణ నిమిత్తం వచ్చే శిక్షణార్ధుల ఉండే బ్యారక్స్ ను ఆధునీకరించి, నండూరి బ్యారక్స్ వద్ద కల్చరల్ ప్రోగ్రామ్స్ నిర్వహించుకొనే విధంగా డయాస్ నిర్మాణం, సిసి రోడ్లు నిర్యాణం, శిక్షనార్ధుల సంక్షేమానికి బారాక్స్ లలో కొత్త మంచాలు, ఫర్నీచర్, లైట్లు, ఫ్యాన్లు ఏర్పాటు చేశారు..

డిజిటల్ క్లాస్ ల కోసం ఏర్పాట్లు

స్మార్ట్ క్లాస్ రూం – శిక్షణార్ధులకు అర్ధమయ్యే రీతిలో శిక్షణనిచ్చేందుకు సాంకేంతికతతో కూడిన స్మార్ట్ స్క్రీన్ ను ట్రైనింగ్ కాన్ఫరెన్సు హాల్ నందు ఏర్పాటే చేసి డిజిటల్ క్లాసులను ప్రారంభించారు.

ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు మంజూరు – పిటిసిలో స్వీపర్ ఉద్యోగులు రిటైర్ మెంట్ కావడం వలన ఎన్నో సంవత్సరాలు స్వీపర్లు లేక ఇబ్బంది పడటంతో, పెండింగ్ లో ఉన్న ఔట్ సోర్సింగ్ స్వీపరు పోస్టులను ఉన్నతాధికారులతో సంప్రదింపులు జరిపి మంజూరు చేయించడంలో విశేష కృషి చేశారు. బెల్ ఆఫ్ అర్మ్స్ మరియు ఫైరింగ్ రేంజ్ – కూలిపోతున్న, శిథిలావస్థలో ఉన్న బెల్ ఆఫ్ అర్మ్స్ ను అన్ని ప్రయత్నాలు చేసి ఆయుధాలు భద్రపరిచేందుకు కొత్తగా బెల్ ఆఫ్ ఆర్మ్స్ ను నిర్మించిడానికి విషేశ కృషి చేసి ఉన్నతాధికారులతో సంప్రదింపులు జరిపి 2 కోట్లు నిధులు మంజూరు చేయించారు. పిటిసి శిక్షణార్ధులు ఫైరింగ్ ప్రాక్టీసు చేసేందుకు ప్రత్యేంగా ఫైరింగ్ రేంజ్ ను ఆధునికరించారు.

క్రమశిక్షణ కలిగిన శిక్షణ – రెండున్నర సంవత్సరాల కాలంలో క్రమశిక్షణ, ఉన్నత విలువలతో కూడిన శిక్షణను శిక్షణార్ధులకు అందించి పోలీసు ప్రతిష్టను పెంచే విధంగా, అంకితభావంతో పనిచే సేవిధంగా శిక్షణను ఇవ్వడంలో సఫలీకృతులయ్యారు.

సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ఏర్పాటు

సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ -ఎస్ఐ మరియు పై అధికారులకు శిక్షణకు వచ్చేటప్పుడు వారికి వసతి సౌకర్యం కొరకు సెంటర్ ఫర్  ఎక్సలెన్స్ ఏర్పాటు చేయుటకు విశేషంగా కృషి చేశారు.

అల్లూరి సీతారామరాజు విగ్రహం ఏర్పాటు – పోలీసు ట్రైనింగ్ శిక్షణా కళాశాల అడ్మిన్ బిల్డింగ్ దగ్గరలో, మన్యంలో స్వాతంత్ర్య ఉద్యమ స్ఫూర్తిని రగిల్చిన స్వాతంత్ర్య సమరయోధుడు అల్లూరి సీతారమరాజు విగ్రహ నిర్మాణం జరిగింది.

సిసి కెమారాలతో నిరంతర స్వలైన్స్ – శిక్షణార్ధుల రక్షణకుగాను పిటిసి ప్రాంగణం చుట్టూ మరియు లోపల ముఖ్యమైన ప్రదేశాలలో సిసి కెమారాలను అమర్చి నిరంతరం సిసి కెమారాలతో సర్వ్ లైన్స్ ఏర్పాటు చేశారు..

బర్డ్స్ పార్క్ – ఆహ్లాదకర వాతావరణంలో వివిధ రకాలైన పక్షులను పెంచేందుకు ప్రత్యేకంగా బడ్జ్ పార్కున నిర్మించి అందులో వివిధ కరాలైన పక్షులను సంరక్షిస్తున్నారు.

పోలీసు యూనిట్ హాస్పిటల్ అధునీకరణ – శిక్షణార్ధుల సంక్షేమం దృష్ట్యా వీటినిలో ఉన్న హాస్పిటల్ ను ఆధునీకరించి, అత్యానిధునికమైన వైద్యపరికరాలను అందుబాటులో ఉంచారు. పిటిసి సిబ్బందికి మరియు శిక్షణార్థులకు అత్యవసర సమయాలలో ఉపయోగపడే విధంగా అంబులెన్స్ ఏర్పాటు దోబీఘాట్ ఏర్పాటు – శిక్షణార్ధులకు వాష్ రూమ్ లు, వారి బట్టలను వాష్ చేసేందుకు దోబీఘాట్లు ఆధునికరించేందుకు విశేష కృషి చేశారు.

గెస్ట్ ఫేకల్టీ రూం – శిక్షణార్థులకు శిక్షణనిచ్చేందుకు బయటనుండి వచ్చే గెస్ట్ ఫేకల్టీ అధికారులు విశ్రాంతి తీసుకొనేందకు గెస్ట్ ఫేకల్టీ రూంను ఏర్పాటు చేశారు.

ఎం.భరత్ కుమార్, సత్యంన్యూస్.నెట్, విజయనగరం

Related posts

ఫుడ్ పాయిజనింగ్ పై ఉన్నతస్థాయి విచారణ షురూ

Satyam NEWS

ఉగాది నుండి శ్రీరామనవమి వరకు విజయనగరంలో శ్రీదండుమారమ్మ ఉత్సవాలు

Satyam NEWS

ధూప దీపాలకూ నోచుకోని కల్యాణ వేంకటేశుడు

Satyam NEWS

Leave a Comment