40.2 C
Hyderabad
April 28, 2024 15: 27 PM
Slider ఆధ్యాత్మికం

రెండు లక్షల మందికి వైకుంఠ ద్వార దర్శనం

tirumala

తిరుమల ఈ నెల చివరి వారంలో రానున్నవైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా రెండు లక్షల మంది భక్తులకు ఆన్ లైన్ టికెట్లను విక్రయించడం ద్వారా, పది రోజుల వ్యవధిలో వారందరికీ శ్రీ వెంకటేశ్వరుని దర్శనం కల్పించాలని తిరుమల తిరుపతి దేవస్థానం నిర్ణయించింది. ఇందుకోసం ఆన్ లైన్ లో రోజుకు 20 వేల టికెట్లను విడుదల చేసింది. రోజుకు 20 వేల టికెట్లను భక్తులకు విక్రయిస్తామని, ఆగమ శాస్త్ర నిపుణుల సలహాలు తీసుకున్నమీదటే 10 రోజుల పాటు వైకుంఠ ద్వారాలను తెరచివుంచాలన్న నిర్ణయం తీసుకున్నామని టీటీడీ అధికారులు స్పష్టం చేశారు. శుక్ర‌వారం నుంచి ఆన్ లైన్ లో ఈ టికెట్లను బుక్ చేసుకోవచ్చని స్పష్టం చేశారు. కాగా, ఈ సంవత్సరం వైకుంఠ ఏకాదశి డిసెంబర్ 25వ తేదీన రానుందన్న సంగతి తెలిసిందే.

Related posts

ఎవరైనా నా పేరు చెబితే క్రిమినల్ కేసు పెట్టండి

Satyam NEWS

వనపర్తిలో గంజాయి, మద్యం, పొగ సేవిస్తున్న వారిపై వల

Satyam NEWS

సాయం కోసం భిక్షాటన చేసిన నటుడు షకలక శంకర్

Satyam NEWS

Leave a Comment