25.2 C
Hyderabad
May 8, 2024 08: 05 AM
Slider మహబూబ్ నగర్

కరోనా కాలాన్ని జీరో విద్యా సంవత్సరంగా ప్రకటించాలి

#Ratlavath Rohit Naiyak

విద్యార్థులు ఆరోగ్యంగా ఉంటే విద్యాబుద్ధులు ఎప్పుడైనా నేర్పించవచ్చు. కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో కూడా- విద్యా సంవత్సరం వృథా అవుతుందనీ, విద్యార్థులు నేర్చుకోవడంలో వెనుకబడుతారనీ ఇలాంటి ఆందోళనలే ఎక్కువగా వినిపిస్తున్నాయి.

కరోనా వైరస్ ప్రపంచవ్యాప్త విలయానికి మన దేశం లేదా మన రాష్ట్రం అతీతం ఏమీ కాదని గణాంకాలు చెబుతున్నాయి. అయినప్పటికీ దేశవ్యాప్తంగా విద్యావేత్తలు, విద్యా కార్యకర్తలు, అధికారులు, ప్రజా ప్రతినిధులు ప్రభుత్వానికి విద్యాసంస్థలు తెరిచే విషయమై పలు సూచనలు చేస్తున్నారు.

కమ్యూనిటీ లెర్నింగ్ సెంటర్లు నిర్వహిస్తారా?

వెంటనే బడులు తెరవాలని, ఆన్‍లైన్ కోచింగ్ ద్వారా విద్యా బోధన చేయాలని, షిఫ్ట్ పద్ధతులలో బడులు తెరవాలని, ఆన్‍లైన్ ఆఫ్‍లైన్ హైబ్రిడ్ పద్ధతులు అవలంబించాలని, కమ్యూనిటీ లెర్నింగ్ సెంటర్లు నిర్వహించాలని… ఇలా రకరకాల సూచనలు వారి నుంచి వస్తున్నాయి.

ఇటువంటి సూచనలకే తల ఒగ్గుతూ ఇజ్రాయేల్, సౌత్ కొరియా, సింగపూర్ దేశాలు కరోనా కట్టడి కాకముందే బడులు ప్రారభించాయి. కానీ కొద్ది రోజులకే విద్యార్థులకు కరోనా సోకినందువల్ల మళ్ళీ మూసివేశాయి. మనం ఇప్పుడు వ్యాధి విజృంభిస్తున్న తరుణంలో ఉన్నాము.

సమూహాలు వ్యాధి వ్యాప్తికి ప్రధాన కారణంగా విశ్వవ్యాప్తంగా అన్ని దేశాలూ ఏకాభిప్రాయానికి వచ్చాయి. టీకాలు వచ్చే వరకు వ్యాధి వ్యాప్తి చెందకుండా ఉండాలంటే భౌతిక దూరం పాటించడం, మాస్కులు ధరించడం, చేతులు శుభ్రపరచడం అనే మూడు మూల సూత్రాలను పాటించాలని అందరమూ ఒప్పుకున్నాం.

మన తరగతి గదులు అంతగా అనుకూలంగా లేవు

ఇవి విజ్ఞానికులు, వైద్య నిపుణులు నిర్ధారించి చెప్పిన అంశాలు. ఈ సూత్రాలను పాటించడానికి మన బడులు మన తరగతి గదులు అంత అనుకూలం కాదు. మన తరగతి గదులు విశాలమైన వెలుతురు, గాలి ఉన్నవి కావు. ప్రైవేటు బడుల తరగతి గదులు ఇంకా క్రిక్కిరిసినవిగా ఉంటాయి. పిల్లలు దూరం పాటించడం చాలా కష్టం.

అంతేగాక, మన విద్యార్థులు చాలామంది దూర ప్రాంతాలలో ఉన్న బడులకు వివిధ రవాణా సదుపాయాలలో వెలుతారు. ఇది మరొక పెద్ద సమస్య. ఎన్.ఎస్.ఎస్.ఒ డాటా-2015 కొన్ని ఆశ్చర్యకరమైన గణాంకాలను తెలియచేస్తున్నది. తెలంగాణలో దాదాపు 50శాతం మంది విద్యార్థులు, అంటే దాదాపు 30 లక్షల మంది, వివిధ రవాణా సౌకర్యాలను వినియోగిస్తున్నారు.

కరోనా సంక్షోభం మరింతగా పొంచి ఉంది

విద్యార్థులు ఎంత క్రిక్కిరిసిన వాహనాల్లో వెళతారో మనకు తెలుసు. మామూలు సమయంలోనే ప్రమాదం. కరోనా కాలంలో ఇంకా ప్రమాదం. ఈ సంక్షోభంలో మరో పెద్ద ప్రమాదం పొంచి ఉంది. పేద, బడుగు బలహీన వర్గాల పిల్లలు కరోనా సంక్షోభంతో పెనం నుండి పొయ్యిలోకి పడ్డట్టయింది.

బడులు లేని కారణంగా వారు బాల కార్మికులుగా మారుతున్నారు. ఆరోగ్య సంక్షోభంతోపాటు బాలల హక్కుల సంక్షోభాన్ని కూడా ప్రభుత్వాలు అంతే పకడ్బందీగా ఎదుర్కొవాలి. పిల్లలకు కరోనా వ్యాధి అంత త్వరగా సోకకపోవచ్చు కానీ, భౌతిక దూరం పాటించడం వారికి సాధ్యం కాకపోవటం వల్ల, వారి ద్వారా పెద్దలకు (అంటే తల్లిదండ్రులకూ టీచర్లకు) మరింత ప్రమాదం. పిల్లలు క్షేమంగా ఉంటే విద్యను ఎప్పుడైనా సాధించవచ్చు.

రాత్లవత్ రోహిత్ నాయక్, TSPTA స్టేట్ డిప్యూటీ జనరల్ సేక్రటరీ

Related posts

వికీపీడియాను మార్చేసిన చంద్రబాబునాయుడు

Satyam NEWS

హుజూర్ నగర్ లో 200 కుటుంబాలు కాంగ్రెస్ పార్టీలో చేరిక

Satyam NEWS

వైసీపీతో ఎన్నికల అధికారుల కుమ్మక్కు పై భత్యాల ఆగ్రహం

Satyam NEWS

Leave a Comment