25.2 C
Hyderabad
May 8, 2024 07: 49 AM
Slider ముఖ్యంశాలు

కార్యకర్తల బలమే నా బలం: డిప్యూటీ స్పీకర్ కోలగట్ల

#kolagatla

సీఎం జగన్ నాయకత్వాన్ని మరింత బలపరిచే విధంగా ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా పనిచేయాలని రాష్ట్ర శాసనసభ ఉపసభావతి కోలగట్ల వీరభద్ర స్వామి అన్నారు. సోమవారం నాడు తన నివాసంలో జరిగిన పార్టీ విస్తృత స్థాయి ఆత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడారు. సీఎం జగన్ ఆశీస్సులతో, అందరి అభిమానంతో తనకు ఈ పదవి రావడం జరిగిందని, తాను జిల్లా కేంద్రంలో అడుగుపెట్టిన తరువాత ప్రజలందరూ అపూర్వ స్వాగతం పలకడం పట్ల ధన్యవాదాలు తెలియజేశారు.

1984 లో తాను కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకుని  రాజకీయ ప్రవేశం చేసినప్పటి నుంచి అనేక ఇబ్బందులు కష్టాలు పడి తాను ఈ స్థాయికి వచ్చానని, తనకున్న బలం ప్రజలు, పార్టీ నాయకులు  మీరేనని అన్నారు. తాను శాసన సభ్యునిగా, శాసనమండలి సభ్యునిగా, జిల్లా పార్టీ అధ్యక్షులుగా, ఉత్తరాంధ్ర కన్వీనర్ గా, డిప్యూటీ స్పీకర్ పదవి చేపట్టిన తనను మాత్రం స్వామి అన్నయ్యగానే చూడండని అన్నారు.

కుల సమీకరణాల దృష్ట్యా,  సీఎం జగన్ తనకు ఉన్నత పదవి ఇచ్చినా అది తన సామాజిక వర్గానికి, విజయనగరం ప్రజలకు ఇచ్చిన గౌరవంగా భావిస్తానన్నారు. ఈ గౌరవాన్ని మరింత నిలబెట్టుకునే విధంగా, పదవితో ప్రజలకు మరింత మేలు జరిగే విధంగా కృషి చేస్తానని, ఎట్టి పరిస్థితులలో అగౌరవం రాకుండా  చూస్తానన్నారు. కష్టపడిన వ్యక్తికి తగిన గుర్తింపు వస్తుంది అనడానికి తానే నిదర్శనం అన్నారు.

తాను  కాంగ్రెస్ పార్టీ ద్వారా ఎమ్మెల్సీ గా ఉన్నప్పుడు , వైయస్ జగన్మోహన్ రెడ్డి తన పార్టీలోకి రావాలని ఆహ్వానించారని, జగన్ పిలుపుతో ఐదు సంవత్సరాలు ఇంకా కాలమున్న  ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగిందన్నారు. మాజీ మంత్రి దివంగత సాంబశివరాజు  సహాయ సహకారాలతో జిల్లా అంతటా పర్యటనలు చేసి, మండలాలలో సమావేశాలు ఏర్పాటు చేసి ప్రజలలో నమ్మకం కలిగే విధంగా కృషి చేశామన్నారు.

ప్రజలంతా వాస్తవాన్ని గమనిస్తున్నారు

మంత్రి బొత్స  సత్యనారాయణ చేరికతో పార్టీ మరింత బలోపేతం అయిందన్నారు. ప్రజలందరూ వాస్తవాలు గమనిస్తున్నారని, ఎవరు అందుబాటులో ఉంటున్నారు, ఎవరి హయాంలో అభివృద్ధి జరుగుతుందో ప్రజలకు అంతా తెలుసునని అన్నారు. ఎన్నికల సమయంలో కొంతమంది రోడ్లపైకి వస్తూ ఉంటారని , ప్రజలను మభ్యపెట్టే  మాటలు చెబుతూ ఉంటారని అన్నారు.

ఇటీవల ప్రతిపక్ష పార్టీ బాదుడే బాదుడు కార్యక్రమాన్ని చేపట్టిందని , ప్రజలలో ఉనికిని చాటుకునేందుకు చేసే ప్రయత్నాన్ని ప్రజలందరూ గమనిస్తున్నారని అన్నారు. 2014లో అధికారం చేపట్టిన చంద్రబాబు హయాములో ఉన్న ధరలు, 2019లో ఉన్న ధరలు పేరిగాయున్నది వాస్తవం కాదా అని ప్రశ్నించారు, ఎన్నికలు ఉన్న లేకపోయినా, పదవులు ఉన్న లేకపోయినా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ప్రజలకు అండగా నిలుస్తున్నారని అన్నారు. సీఎం జగన్ ఆలోచనలకు, ప్రభుత్వానికి మద్దతుగా నిలబడాలని అన్నారు.

రాష్ట్ర విభజన జరిగినప్పుడు రాష్ట్ర ప్రజలందరూ బాధపడ్డారని, హైదరాబాద్ పై 10 సంవత్సరాలు హక్కు ఉన్న, చంద్రబాబు నాయుడు మూట ముళ్ళు సర్దుకుని వచ్చేసారని ప్రజలకు అన్యాయం చేశారు అని అన్నారు. శాసనసభ్యునిగా పలుమార్లు అమరావతికి వెళ్లి చూస్తే చాలావరకు షేడ్ లలో ఉండే పరిస్థితి నెలకొందన్నారు. చంద్రబాబు నిర్వాకం వల్ల కారు డ్రైవర్లకు, గన్మెన్లకు టీ దొరకని పరిస్థితి కూడా నెలకొందని అన్నారు.

సీఎం జగన్ ఆలోచనలు ఒకే ప్రాంతమ్ లో అభివృద్ధి జరగకూడదని, మూడు ప్రాంతాలు అభివృద్ధి జరిగితే అన్ని విధాలుగా ఆయా ప్రాంతాల ప్రజలకు మేలు జరుగుతుందనే భావనతోనే మూడు రాజధానులు ప్రకటన చేయడం  జరిగిందన్నారు. విభజించి పరిపాలన చేపడితే, రాబోయే తరానికి నష్టం జరగదని అన్నారు. ప్రతి ప్రాంతాల్లో అభివృద్ధి జరిగితే రాబోయే తరానికి  ఎంతో మేలు జరుగుతుందని అన్నారు.

విశాఖపట్నం పరిపాలన రాజధానిగా కావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. చంద్రబాబు నాయుడు లోపాయి కారిగా, కుయుక్తుల పన్ని  రాజధాని ఇక్కడే అని విస్తృత ప్రచారం చేసి భూములు కొనిపించారని అన్నారు.  పరిపాలన రాజధానిగా విశాఖపట్నం కావాల్సిన  అవసరాన్ని ప్రతి ఒక్కరు గుర్తించాలని అన్నారు. అమరావతి యాత్ర తమ హక్కుల కోసం, డిమాండ్ కోసం చేపడితే బాగుంటుంది తప్ప, ఆయా ప్రాంత  ప్రజలు మనోభావాలు దెబ్బతీసే విధంగా యాత్ర చేస్తే ప్రజలు ఊరుకునేది లేదన్నారు.

పరిపాలనా రాజధానిగా వైజాగ్

విశాఖపట్నం  పరిపాలన రాజధాని డిమాండ్ ను మనందరి డిమాండ్ గా ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్లవలసిన అవసరం ఉందన్నారు, ప్రభుత్వానికి మద్దతుగా నిలవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. ఈనెల 5వ తేదీన ఉదయం ఎనిమిది గంటల 30 నిమిషాలకు మూడు లంతర్లు వద్ద ఉన్న పైతలమ్మ వారి గుడి వద్ద  సీఎం జగన్  కి మరింత శక్తిని ప్రసాదించాలని కోరుతూ, కుటిల రాజకీయం చేస్తున్న చంద్రబాబు నాయుడు మనసు మారాలని పైడితల్లి అమ్మవారికి విశేష పూజలు చేసి, విశాఖపట్నం పరిపాలన రాజధానిగా  కావాలంటూ చేపట్టే ర్యాలీకి నాయకులు, కార్యకర్తలు తరలిరావాలని పిలుపునిచ్చారు.

అలాగే అదే రోజు సాయంత్రం  6 గంటలకు గంటస్తంభం అభివృద్ధి పనులను, రైల్వే స్ట్రేషన్ ఏరియా డబుల్ రోడ్ అభివృద్ధి పనులను మంత్రి బొత్స సత్యనారాయణ గారి చేతుల మీదుగా ప్రారంభిస్తారని తెలిపారు. అలాగే  పార్టీ కమిటీల నియామకం పూర్తిగా తన పూర్తి చేయాల్సిన బాధ్యత ఆయా జోనల్ లీడర్స్, మండల పార్టీ నాయకులు త్వరితగతిన పూర్తి చేయాల్సిన అవసరం ఉందన్నారు.

పార్టీ ఉంటే మనం ఉన్నామన్న సంగతి గ్రహించి భవిష్యత్తు రాజకీయాలను, సీఎం జగన్ నాయకత్వాన్ని మరింత బలంగా ఉంచేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి అన్నారు. సామాన్య కార్యకర్తగా అందరితో కలిసి ఉండటం తనకిష్టమని, గర్భం అనేది తనకు తెలియదన్నారు. సీఎం జగన్ పరిపాలన మరోసారి రావాల్సిన అవసరం ఉందని అన్నారు.

నగరపాలక సంస్థలు 50  కార్పొరేటర్ స్థానాలను, మండలంలో 12 ఎంపీటీసీ స్థానాలను, 22 సర్పంచ్ స్థానాలను కైవసం చేసుకునేదిగా పనిచేయాలని అన్నారు.సీఎం జగన్ తన చేతలతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తూ ఉంటే, చంద్ర బాబు నాయుడు మాటలతో కాలాన్ని వెల్లబుచ్చారని అన్నారు. ఈ కార్యక్రమంలో నగర పార్టీ అధ్యక్షులు, మండల పార్టీ అధ్యక్షులు, జోనల్ ఇంచార్జ్ లు, కార్పొరేటర్ లు, మండల ప్రతినిధులు, పార్టీ అనుబంధ విభాగాల నాయకులు, మహిళలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Related posts

తాగు నీటి సమస్యను పరిష్కరించిన అంబర్ పేట్ ఎమ్మెల్యే

Satyam NEWS

స్వ‌ర్ణ‌క‌వ‌చాలంకృత క‌న‌క‌దుర్గాదేవి

Satyam NEWS

వెరైటీ ప్రొటెస్టు: నా వారసుడు పిచ్చి తుగ్లక్ ఎక్కడ?

Satyam NEWS

Leave a Comment