40.2 C
Hyderabad
April 28, 2024 17: 44 PM
Slider ఖమ్మం

ఐఫ్టీయు జాతీయ మహాసభలకు తరలిన ప్రతినిధులు

#IFTU National Congresses

భారత కార్మిక సంఘాల సమాఖ్య iftu జాతీయ 7వ మహాసభలకు బయలుదేరిన ఖమ్మం జిల్లా సంఘం ప్రతినిధులు
ఈ సందర్భంగా ఐఎఫ్టియు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు షేక్ సుబహాన్,ఐ.వెంకన్న లు మాట్లాడుతూ కార్మిక హక్కుల కొరకు నిరంతరం పోరాటం చేస్తూ దేశంలో జరుగుతున్న పాసిస్ట్ విధానాలకు వ్యతిరేకంగా కార్మికులు పనిచేయాలని శ్రమ దోపిడీ దోపిడి వలన కార్మికులకు తగిన వేతనం రావటం లేదనివారు అన్నారు.

కార్మిక హక్కులవ్యతిరేక కార్పొరేతికరణకు అనుకూలంగా చట్టాలను తీసుకొచ్చి బహుళ జాతి కంపెనీలకు ( ఆదాని అంబానీ) దేశ సంపదను తాకట్టు పెట్టే కుటీల ప్రయత్నం జరుగుతుందని ఈ సందర్భంలో వివిధ రంగాలలో పనిచేసే కార్మికులు సంఘటితం అయి ఉద్యమించాల్సిన అవసరం ఎంతైనా ఉందని వారు అన్నారు.


ఈ సందర్భంగా అఖిల భారత స్థాయిలో తమ సంఘాన్ని బలోపేతం చేయడం కోసం తిరుపతి పట్టణంలో ఈనెల 16,17,18 తేదీలలో సంఘం జాతీయ 7వ మహాసభలను జరుపుకుంటుందని ఈ మహాసభలలో భవిష్యత్ కర్తవ్యాలను రూపొందించుకొని మతోన్మాద బిజెపి ప్రభుత్వంపై దేశ సంపదలో భాగమైనటువంటి 89 రకాల కానిజా సంపదను బహుళ జాతి కంపెనీలకు కట్టబెట్టకుండా దశల వారి ఉద్యమ కార్యాచరణను రూపొందించుకుంటుందనీవారు అన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కోశాధికారి మహంకాళి ఉప్పలయ్య, జిల్లా నాయకులు బ్రహ్మచారి, గుగులోతు పటేల్, బోడ నాగేశ్వరరావు, పోకల వెంకన్న,జి మోహన్ రావు,పాడిశాల మైసయ్య, జి మల్లేశం, గంగుల శ్రీను,తదితరులు వెళ్లారు.

Related posts

పోలింగ్ ను తీరుతెన్నుల‌ను ప‌రిశీలించిన…ఎస్పీ

Satyam NEWS

BJP ప్రభుత్వం తన మొండి విధానాలను విడనాడాలి

Satyam NEWS

అచ్చన్నాయుడి బెయిల్ పిటిషన్ కొట్టేసిన హైకోర్టు

Satyam NEWS

Leave a Comment